కూలిన చోటే విగ్రహాన్ని నిర్మిస్తాం

గూండాగిరికి పాల్పడుతున్న టిఎంసి యుపి సభలో ఎస్‌పి బిఎస్‌పి పైనా నిప్పులు చెరిగిన ప్రధాని మవు (యుపి): లోక్‌సభ ఎన్నికల తుది విడత ప్రచారానికి శుక్రవారంతో తెరపడనుండడంతో ప్రధాని నరేంద్ర మోడీ తన మాటల దూకుడును మరింత పెంచారు. ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ గూండాగిరిపై మండి పడ్డారు. గురువారం ఉత్తరప్రదేశ్‌లోని మవులో జరిగిన ఎన్నికల సభలో ప్రధాని మాట్లాడుతూ, కొద్ది నెలల క్రితం తాను పశ్చిమ బెంగాల్‌లోని వెస్ట్ మిడ్నాపూర్‌లో ర్యాలీ […] The post కూలిన చోటే విగ్రహాన్ని నిర్మిస్తాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

గూండాగిరికి పాల్పడుతున్న టిఎంసి
యుపి సభలో ఎస్‌పి బిఎస్‌పి పైనా నిప్పులు చెరిగిన ప్రధాని

మవు (యుపి): లోక్‌సభ ఎన్నికల తుది విడత ప్రచారానికి శుక్రవారంతో తెరపడనుండడంతో ప్రధాని నరేంద్ర మోడీ తన మాటల దూకుడును మరింత పెంచారు. ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ గూండాగిరిపై మండి పడ్డారు. గురువారం ఉత్తరప్రదేశ్‌లోని మవులో జరిగిన ఎన్నికల సభలో ప్రధాని మాట్లాడుతూ, కొద్ది నెలల క్రితం తాను పశ్చిమ బెంగాల్‌లోని వెస్ట్ మిడ్నాపూర్‌లో ర్యాలీ నిర్వహించినప్పుడు టిఎంసి గూండాలు స్వైర విహారం చేశారని, ఆ తర్వాత ఠాకూర్‌నగర్‌లోను ఇదే పరిస్థితి ఎదురు కావడంతో తాను ప్రసంగాన్ని కుదించుకొని బలవంతంగా వేదిక దిగాల్సి వచ్చిందని చెప్పారు. ‘ ఇప్పుడు అమిత్ షా కోల్‌కతా రోడ్‌షోలనూ టిఎంసి గూండాలు రెచ్చి పోయారు. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని విధ్వంసం చేశారు. విద్యాసాగర్ కలల సాకారానికి మేము కట్టుబడి ఉన్నాం. తిరిగి అధికారంలోకి రాగానే ఎక్కడయితే విగ్రహాన్ని కూల్చేశారో అక్కడే అంతకన్నా భారీ విగ్రహాన్ని నిర్మిస్తాం’ అని చెప్పారు. అంతేకాదు, విగ్రహం కూల్చివేతకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

తాను ఈ రోజు సాయంత్రం డమ్‌డమ్‌లో ఒక ర్యాలీలో పాల్గొనడం కోసం వెళుతున్నానని ఆయన చెప్తూ, అయితే దీదీ (మమతా బెనర్జీ) తన హెలికాప్టర్ దిగడానికి అనుమతిస్తారో లేదో తెలియదని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో హింసకు తనపై విమర్శలు చేసిన బిఎస్‌పి అధినేత్రి మాయావతి తీరును మోడీ తప్పుబడుతూ. ఉత్తరప్రదేశ్, బిహార్ ,పూర్వాంచల్ ప్రజలను బయటి వ్యక్తులుగా మమతా బెనర్జీ టార్గెట్ చేస్తున్నారని, బెహన్ మాయావతి అయినా ఈ చర్యను ఖండిస్తారని అనుకుంటే ఆమె కూడా ఆ పని చేయడం లేదని విమర్శించారు. అత్యాచారం కేసులో పరారయిన వ్యక్తి కి ఎస్‌పిబిఎస్‌పి కూటమి ఇక్కడినుంచి టికెట్ ఇచ్చిందంటూ ఆయన మండిపడ్డారు. యుపి లో సమాజ్‌వాది పార్టీ చరిత్ర ఏమిటో అందరికీ తెలిసిందేనని అంటూ, అలాంటి వారికి ఓటేయమని మాయావతి ప్రజలను అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.‘ మోడీ హటావో నినాదాలు చేస్తున్న వారు ఇప్పుడు ఓటమి భయంతో బెదిరిపోతున్నారని, వాళ్ల లెక్కలు తప్పని ఉత్తరప్రదేశ్ ఓటర్లు నిరూపించారని, అందుకే తనపై విమర్శలు పెరిగాయని చెప్పా రు. ఎస్‌పి, బిఎస్‌పిలు అవకాశవాద పొత్తు కుదుర్చుకున్నాయని, వారు సై స్థాయి తో పొత్తుకుదుర్చుకున్నారు కానీ కింది స్థాయి లో వాళ్ల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకుంటున్నారని అన్నారు. ఈ రెండు పార్టీలు కూడా కులాల పేరుతో అధికారాన్ని సంపాదించుకున్నాయని, బంధువులు కోటీశ్వరులు కావడానికి దాన్ని ఉపయోగించుకున్నాయన్నారు.

Modi factor poses challenge to SP BSP in eastern UP

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కూలిన చోటే విగ్రహాన్ని నిర్మిస్తాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: