18న రామగుండం,19న కాళేశ్వరంలో సిఎం పర్యటన…

  హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై ఈ నెల 18, 19న ముఖ్యమంత్రి కెసిఆర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు. 18న రామగుండంలో నిర్మాణంలో ఉన్న 1,600 మెగావాట్ల ఎన్టీపిసి విద్యుత్ ప్లాంట్‌ను పరిశీలిస్తారు. అక్కడే ఎన్టీపీసి, జెన్‌కో అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారు. మరుసటి రోజు 19న కాళేశ్వరంలో సిఎం పర్యటిస్తారు. ఉదయం కాళేశ్వరం దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజి నిర్మాణ ప్రాంతం, కన్నెపల్లి పంపుహౌజ్, కాఫర్ డ్యాం, హెడ్‌రెగ్యులేటర్లు, […] The post 18న రామగుండం,19న కాళేశ్వరంలో సిఎం పర్యటన… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై ఈ నెల 18, 19న ముఖ్యమంత్రి కెసిఆర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు. 18న రామగుండంలో నిర్మాణంలో ఉన్న 1,600 మెగావాట్ల ఎన్టీపిసి విద్యుత్ ప్లాంట్‌ను పరిశీలిస్తారు. అక్కడే ఎన్టీపీసి, జెన్‌కో అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారు. మరుసటి రోజు 19న కాళేశ్వరంలో సిఎం పర్యటిస్తారు. ఉదయం కాళేశ్వరం దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజి నిర్మాణ ప్రాంతం, కన్నెపల్లి పంపుహౌజ్, కాఫర్ డ్యాం, హెడ్‌రెగ్యులేటర్లు, గ్రావిటీ కెనాల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. హెలికాప్టర్‌లో ఏరియల్ వ్యూతో నిర్మాణ పనులు చూసే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి పోలీసు అధికారులకు సమాచారం పంపించారు. బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

 

CM tour in Kalleshwaram, Ram Gundam

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 18న రామగుండం,19న కాళేశ్వరంలో సిఎం పర్యటన… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: