లెఫ్ట్ ఓటు బ్యాంకు బిజెపికి!

  టిఎంసి అంతర్గత సర్వేలో వెల్లడి రందిల్లుతున్న దీదీ న్యూఢిల్లీ: ప్రముఖ సంఘ సంస్కర్తగా పేరు పొందిన ఈశ్వర చంద్ర విద్యాసాగర్ జన్మించిన 199 ఏళ్ల తర్వాత ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో మరోసారి ఆయన పేరు మారుమోగిపోతోంది. రెండు రోజుల క్రితం కోల్‌కతాలో బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా రోడ్ షో సందర్భంగా చెలరేగిన హింసాకాండలో విద్యాసాగర్ విగ్రహం ధ్వంసం కావడంతో ఈ సంఘటనను రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవడానికి అధికార తృణమూల్ కాంగ్రెస్, బిజెపిలు పోటీ పడుతున్నాయి. […] The post లెఫ్ట్ ఓటు బ్యాంకు బిజెపికి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

టిఎంసి అంతర్గత సర్వేలో వెల్లడి

రందిల్లుతున్న దీదీ

న్యూఢిల్లీ: ప్రముఖ సంఘ సంస్కర్తగా పేరు పొందిన ఈశ్వర చంద్ర విద్యాసాగర్ జన్మించిన 199 ఏళ్ల తర్వాత ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో మరోసారి ఆయన పేరు మారుమోగిపోతోంది. రెండు రోజుల క్రితం కోల్‌కతాలో బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా రోడ్ షో సందర్భంగా చెలరేగిన హింసాకాండలో విద్యాసాగర్ విగ్రహం ధ్వంసం కావడంతో ఈ సంఘటనను రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవడానికి అధికార తృణమూల్ కాంగ్రెస్, బిజెపిలు పోటీ పడుతున్నాయి. అయితే ఈ విషయంలో టిఎంసి అధినేత మమతా బెనర్జీ మిగతా ప్రత్యర్థులకన్నా ఓ అడుగు ముందే ఉన్నారు. బెంగాల్ సెంటిమెంట్‌ను రగల్చడం ద్వారా వామపక్షాల్లోని విద్యావంతులైన మధ్య తరగతి ఓటు బ్యాంకును తమ పార్టీ వైపు తిప్కువడానికి ప్రయత్నిస్తున్నారు. వామపక్షాలు సైతం ఈ సంఘటనపై ఆందోళన చేస్తూ ఉండడంతో బిజెపి ఒక విధంగా ఆత్మరక్షణలో పడిందని చెప్పాలి. ఈ సంఘటన అంతగా రాజకీయ రంగు పులుముకోవడానికి బలమైన కారణాలు కూడా లేకపోలేదు.

ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట అయిన పశ్చిమ బెంగాల్‌లో కాలూనడానికి బిజెపి చాలాకాలంనుంచే ప్రయత్నిస్తూ వస్తోంది. అయితే అప్పట్లో అధికారంలో ఉండిన వామపక్షాలు అందుకు అవకాశం ఇవ్వకపోగా, ఆ తర్వాత కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టి అధికారాన్ని దక్కించుకున్న తృణమూట్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ లెఫ్ట్ ఓటు బ్యాంకును కూడా తన వైపునకు తిప్పుకొంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి 16 శాతం ఓట్లు దక్కించుకున్నప్పటికీ బలమైన మోడీ గాలి వీచిన ఆ ఎన్నికల్లో ఆ పార్టీకి దక్కింది 2 స్థానాలు మాత్రమే. రాష్ట్రంలోని మొత్తం 42 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ 34స్థానాలను దక్కించుకుని తనకు ఎదురు లేదని నిరూపించుకుంది. ఆ ఎన్నికల్లో కమ్యూనిస్టులకు దక్కింది రెండు స్థానాలే అయినప్పటికీ దాదాపు 30 శాతం ఓట్లతో వారు బలమైన శక్తిగానే ఉన్నారు. అయితే ఈ అయిదేళ్ల కాలంలో రాష్ట్రంలో కమ్యూనిస్టుల ఓటు బ్యాంకును ఇటు మమతా బెనర్జీ పార్టీ, అటు బిజెపి క్రమంగా మింగేశాయి.

కాగా ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలకు చెందిన ఓటు బ్యాంకులో కొంత భాగం బిజెపికి వెళ్లనున్నట్లు టిఎంసి అంతర్గత నివేదికలు వెల్లడించడం ఆ పార్టీని కలవరపెడుతోంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఇంత తీవ్రంగా మారడానికి కూడా ఇదే ప్రధాన కారణం. కమ్యూనిస్టుల స్థానంలో బిజెపి తమకు ప్రధాన ప్రత్యర్థిగా మారబోతోందన్న నిజం మమతకు మింగుడు పడడవ లేదు. ‘లెఫ్ట్ ఓటు బిజెపి వైపు ఎంత మేరకు మొగ్గుతుందనే దానిపై మావిజయావకాశాలు అధార పడి ఉన్నాయి. 30కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని మేము అనుకుంటున్నాం. అయితే వామపక్షాల ఓటు శాతం తగ్గితే అది 25కు కూడా తగ్గవచ్చు’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని టిఎంసి నాయకుడొకరు చెప్పడం గమనార్హం. మైనారిటీలు ఎక్కువ సంఖ్యలో లేని దాదాపు 15స్థానాల్లో బిజెపి గణనీయంగా బలం పుంజుకుందన్న వార్తలు కూడా టిఎంసి నేతలను కలవరపెడుతున్నాయి. ఇదే కాకుండా వామపక్షాల ప్రధాన ఓటు బ్యాంకు అయిన మధ్య తరగతిలో బిజెపి క్రమంగా చొచ్చుకు పోతోందన్న అంచనాలు సైతం ఆ పార్టీని ఆందోళనకు గురి చేస్తున్నాయి.

అయితే టిఎంసి ప్రతినిధి డెరిక్ ఒ బ్రియాన్ మాత్రం ఈ వాదనలను కొట్టి వేస్తున్నారు.‘మమతా బెనర్జీ నాయకత్వంలో మా సీట్ల స్థాయి ఈ సారి ఇంకా పెరుగుతుంది. మంగళవారం నాటి సంఘటనల తర్వాత పశ్చిమ బెంగాల్‌లో బిజెపి లబ్ధి పొందడానికి ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించం’ అని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో టిఎంసికి 34 స్థానాలు దక్కితే బిజెపికి వచ్చింది రెండు సీట్లేనని చెప్పిన ఆయన 2011నుంచి తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న విషయాన్ని మరిచిపోరాదన్నారు. లోక్‌సభ ఎన్నికల చివరి విడతలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో తొమ్మిది లోక్‌సభ స్థానాలకు ఈ నెల19న పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గాలన్నీ కూడా ఒక విధంగా హిందూ ఓటర్లు ఎక్కువగా ఉన్నవే కావడంతో వారంతా బిజెపికి మద్దతు ఇస్తారనే నమ్మకం జనాల్లో ఉంది.

ఇదే కాకుండా చాపకింద నీరులాగా లెఫ్ట్ ఓటు బ్యాంకు కూడా కొంత మేరకు ఆ పార్టీ వైపు మొగ్గే అవకాశ ఉందని అంటున్నారు. ఒక్క సిపిఎం పార్టీయే కాదు, టిఎంసి, కాంగ్రెస్‌లోని విద్యావంతులు కూడా తమకే ఓటు వేస్తారని బిజెపి వర్గాలు అంటున్నాయి. లెఫ్ట్ ఓటు బ్యాంకు బిజెపి వైపు మొగ్గడానికి కారణం లేక పోలేదు. తమను అధికారంనుంచి దింపి వేయడమే కాకుండా తన ఓటు బ్యాంకును కూడా మింగేసిన మతతా బెనర్జీకన్నా బిజెపిని తక్కువ శత్రువుగా వారు భావిస్తే ఉండడమే దీనికి కారణం. మమతా బెనర్జీ కూడా వామపక్షాల ఓటు బ్యాంకు బిజెపి వైపు మళ్లుతోందని అంటున్నారని ఆ పార్టీ నేత ఒకరు అంటూ ఎందుకు మళ్లుతోందో ఆమెనే అడగండని అనడం గమనార్హం.

Trinamool internal analysis indicates Left vote may shift to BJP

Related Images:

[See image gallery at manatelangana.news]

The post లెఫ్ట్ ఓటు బ్యాంకు బిజెపికి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: