ప్రధాన పాత్రలో ‘సఖి’

  నరేంద్ర అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘సఖి’ అనే టైటిల్ ను చిత్రబృందం ఖరారు చేసినట్లు తెలిసింది. అయితే టైటిల్ కి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతానికైతే ఐరోపాలో కీలక సన్నివేశాలను షూట్ చేస్తోంది చిత్రయూనిట్. అయితే మహిళలపై దాడుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలిసింది. ‘మహానటి’ సినిమాలో […] The post ప్రధాన పాత్రలో ‘సఖి’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నరేంద్ర అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘సఖి’ అనే టైటిల్ ను చిత్రబృందం ఖరారు చేసినట్లు తెలిసింది. అయితే టైటిల్ కి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతానికైతే ఐరోపాలో కీలక సన్నివేశాలను షూట్ చేస్తోంది చిత్రయూనిట్. అయితే మహిళలపై దాడుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలిసింది. ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న కీర్తి సురేష్.. మరి ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందా అనేది చూడాలి. ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో నరేష్, నదియా, రాజేంద్రప్రసాద్, కమల్ కామరాజు, భానుశ్రీ మెహ్రా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Keerthy Suresh Next Titled As Sakhi

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రధాన పాత్రలో ‘సఖి’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: