బ్లాక్‌బస్టర్ మూవీ దర్శకుడితో చిత్రం?

  ‘గీత గోవిందం’ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు పరశురామ్ ఇప్పటికే పది నెలల గ్యాప్ తీసుకున్నారు. తన నెక్స్ సినిమా గీతా ఆర్ట్‌కే కమిట్ అయినా కాంబినేషన్ సెట్ కాకపోవడంతో ఇన్ని నెలలు ఎదురుచూడాల్సి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం పరశురామ్ చెప్పిన ఒక లైన్ సూపర్‌స్టార్ మహేష్ బాబుకి నచ్చిందట. కొరటాల శివ ద్వారా మహేష్‌ను కలిసిన అతను పూర్తి స్క్రిప్ట్‌తో రమ్మనే మాటతో హ్యాపీగా వెనక్కి వచ్చారట. అంటే దర్శకుడు […] The post బ్లాక్‌బస్టర్ మూవీ దర్శకుడితో చిత్రం? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

‘గీత గోవిందం’ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు పరశురామ్ ఇప్పటికే పది నెలల గ్యాప్ తీసుకున్నారు. తన నెక్స్ సినిమా గీతా ఆర్ట్‌కే కమిట్ అయినా కాంబినేషన్ సెట్ కాకపోవడంతో ఇన్ని నెలలు ఎదురుచూడాల్సి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం పరశురామ్ చెప్పిన ఒక లైన్ సూపర్‌స్టార్ మహేష్ బాబుకి నచ్చిందట. కొరటాల శివ ద్వారా మహేష్‌ను కలిసిన అతను పూర్తి స్క్రిప్ట్‌తో రమ్మనే మాటతో హ్యాపీగా వెనక్కి వచ్చారట. అంటే దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రం తర్వాత ఈ సూపర్‌స్టార్ చేయబోయే ప్రాజెక్ట్ కోసం ఇప్పటి నుంచే రంగం సిద్ధమవుతోంది అన్నమాట. నిర్మాత ఎవరు ఉంటారు అనేది మాత్రం తేలాల్సి ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోయే మూవీ నుంచి దిల్ రాజు తప్పుకున్నాక అనిల్ సుంకర సోలో ప్రొడ్యూసర్ గా నిలిచారు. కాబట్టి ఒక కమిట్‌మెంట్ దిల్ రాజుకి మహేష్ బ్యాలెన్స్ ఉన్నారు. ఇక గీతా ఆర్ట్ బ్యానర్‌లో సినిమా కోసం గతంలోనే అల్లు అరవింద్‌కు మాట ఇచ్చారు ఈ సూపర్‌స్టార్. ఎలాగూ పరశురామ్ గీతా ఆర్ట్ బ్యానర్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది. దీంతో పరశురామ్ స్క్రిప్ట్ ఓకే అయితే దిల్‌రాజు, అల్లు అరవింద్ నిర్మాతలుగా మహేష్ ఓ సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే దీనికి చాలా సమయం పడుతుంది.

Mahesh Babu Movie With Director Parasuram

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బ్లాక్‌బస్టర్ మూవీ దర్శకుడితో చిత్రం? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: