డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్

  ‘మజిలీ’ హిట్‌తో అక్కినేని నాగచైతన్య ఎంతో ఆనందంగా ఉన్నారు. చైతూ కెరీర్‌లో భారీ వసూళ్ల చిత్రంగా ఇది నిలిచి రికార్డుల్లోకి ఎక్కింది. ప్రస్తుతం అతను వెంకటేష్‌తో కలిసి ‘వెంకీమామ’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే మరో రెండు ప్రాజెక్ట్‌లను కూడా లైన్‌లో పెట్టారు. దిల్‌రాజు నిర్మాణంలో శశి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్‌ను […] The post డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

‘మజిలీ’ హిట్‌తో అక్కినేని నాగచైతన్య ఎంతో ఆనందంగా ఉన్నారు. చైతూ కెరీర్‌లో భారీ వసూళ్ల చిత్రంగా ఇది నిలిచి రికార్డుల్లోకి ఎక్కింది. ప్రస్తుతం అతను వెంకటేష్‌తో కలిసి ‘వెంకీమామ’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే మరో రెండు ప్రాజెక్ట్‌లను కూడా లైన్‌లో పెట్టారు. దిల్‌రాజు నిర్మాణంలో శశి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. గతంలో వీరిద్దరూ కలిసి ‘దడ’ సినిమాలో రొమాన్స్ చేశారు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. మళ్లీ చాలా కాలం తర్వాత నాగచైతన్య, కాజల్ కలిసి నటించబోతున్నారు. డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్, లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ప్రస్తుతం శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఇండియన్ 2’లో కాజల్ నటిస్తోంది. అలాగే తెలుగులో ‘సీత’లో నటించింది. శర్వానంద్ 27వ సినిమాలోనూ ఈ అమ్మడే హీరోయిన్.

Majili movie is Naga Chaitanya delivers career best record

Related Images:

[See image gallery at manatelangana.news]

The post డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: