ప్రగ్యాసింగ్ జాతిపితను అవమానించారు…

  గాడ్సేను పొగిడినందుకు క్షమాపణ చెప్పాలి : కెటిఆర్ ట్వీట్ హైదరాబాద్: మహాత్మాగాంధీని చంపిన గాడ్సేను దేశభక్తుడుగా కీర్తించిన బిజెపి పార్లమెంట్ అభ్యర్థి ప్రగ్యాసింగ్ భేషరతుగా దేశప్రజలకు క్షమాపణలు చెప్పాలని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు డిమాండ్ చేశారు. ప్రగ్యాసింగ్ హేయమైన వ్యాఖ్యానాలు దేశప్రజల మనోభావాలు దెబ్బతీసేవిధంగా ఉన్నాయని ట్విట్టర్‌లో కెటిఆర్ విచారం వ్యక్తం చేశా రు. జాతిపితను అమమానించడమంటే దేశాన్ని అవమానించినట్లేనని ఆయన పేర్కొన్నారు. ఏరాజకీయ పార్టీకి చెందిన వారైనా, ఏ భావజాలమున్నా కొన్నిపరిధులు […] The post ప్రగ్యాసింగ్ జాతిపితను అవమానించారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గాడ్సేను పొగిడినందుకు క్షమాపణ చెప్పాలి : కెటిఆర్ ట్వీట్

హైదరాబాద్: మహాత్మాగాంధీని చంపిన గాడ్సేను దేశభక్తుడుగా కీర్తించిన బిజెపి పార్లమెంట్ అభ్యర్థి ప్రగ్యాసింగ్ భేషరతుగా దేశప్రజలకు క్షమాపణలు చెప్పాలని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు డిమాండ్ చేశారు. ప్రగ్యాసింగ్ హేయమైన వ్యాఖ్యానాలు దేశప్రజల మనోభావాలు దెబ్బతీసేవిధంగా ఉన్నాయని ట్విట్టర్‌లో కెటిఆర్ విచారం వ్యక్తం చేశా రు. జాతిపితను అమమానించడమంటే దేశాన్ని అవమానించినట్లేనని ఆయన పేర్కొన్నారు. ఏరాజకీయ పార్టీకి చెందిన వారైనా, ఏ భావజాలమున్నా కొన్నిపరిధులు దాటకూడదని కెటిఆర్ హితవు పలికారు.

మహాత్మున్ని చంపిన గాడ్సే దేశభక్తుడనీ, తడు దేశభక్తుడిగానే ఉంటారనీ, అతడిని ఉగ్రవాదిగా పిలుస్తున్నవారు తమను తాము విశ్లేషించుకోవాలని ప్రగ్యాసింగ్ ఠాకూర్ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారని కెటిఆర్ గుర్తు చేశారు. గాడ్సేను ఉగ్రవాది గా ప్రచారంచేస్తున్న వారికి ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పాలని ప్రగ్యాసింగ్ ఠాకూర్ చెప్పారు. ఈ నేపథ్యంలో కెటిఆర్ ట్విట్టర్‌లో ప్రగ్యాసింగ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే గాడ్సేపై ప్రగ్యాసింగ్ చేసిన వ్యాఖ్యానాలు ఆమెవ్యక్తిగతమా, బిజెపి పార్టీ విధానామా? స్పష్టం చేయాలని కెటిఆర్ ట్వీట్ అనంతరం నెటిజన్స్ స్పందిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం తొలి ఉగ్రవాది గాడ్సే అని ఇటీవల తమిళనాడులో కమల్‌హాసన్ చేసినవ్యాఖ్యానాలకు ప్రగ్యాసింగ్ బదులు ఇచ్చారా? లేదా బిజెపి విధానాల్లో భాగంగా గాంధీని చంపిన గాడ్సేను దేశభక్తుడని కొనియాడుతున్నారో ప్రగ్యాసింగ్ స్పష్టం చేయాలని ట్విట్టర్‌లో నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.

Pragya Singh insulted Mahatma Gandhi

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రగ్యాసింగ్ జాతిపితను అవమానించారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: