అర్బన్ ఫారెస్ట్ పార్కులు…

  నవంబర్‌కల్లా సిద్ధం అధికారులతో సమీక్షలో సిఎస్ * అర్బన్ ఫారెస్టు పార్కుల అభివృద్ధి * త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి పార్కులు * ఎన్నికలు, కోడ్ పేరుతో పనుల్లో జాప్యం తగదు * వివిధ శాఖల అధికారులతో సిఎస్ సమీక్ష  హైదరాబాద్ : అర్బన్ ఫారెస్టు పార్కులను వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కె.జోషి సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. వరుస ఎన్నికల నేపథ్యంలో పనుల నిర్వహణలో కొంత వరకు […] The post అర్బన్ ఫారెస్ట్ పార్కులు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నవంబర్‌కల్లా సిద్ధం
అధికారులతో సమీక్షలో సిఎస్

* అర్బన్ ఫారెస్టు పార్కుల అభివృద్ధి
* త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి పార్కులు
* ఎన్నికలు, కోడ్ పేరుతో పనుల్లో జాప్యం తగదు
* వివిధ శాఖల అధికారులతో సిఎస్ సమీక్ష

 హైదరాబాద్ : అర్బన్ ఫారెస్టు పార్కులను వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కె.జోషి సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. వరుస ఎన్నికల నేపథ్యంలో పనుల నిర్వహణలో కొంత వరకు జాప్యం జరిగిందన్నారు. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ ముగిసిందన్నారు. పనులను వేగవంతం చేసి నవంబర్ కల్లా పూర్తి చేయాలని సూచించారు. హెచ్‌ఎండిఏ పరిధిలోని అభివృద్ధి చేస్తున్న 59 పార్కుల పురోగతిపై ఏడు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఎస్ జోషి మాట్లాడుతూ పట్టణ ప్రాంత ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు అర్బన్ ఫారెస్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కాంక్రీట్ జంగిల్‌లాంటి నగరాల్లో కాస్త సేద తీరేందుకు రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ ఫారెస్టు పార్కుల ను అభివృద్ధి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 129 అటవీ ప్రాంతాలను అభివృద్ధి కోసం గుర్తించగా ఇందులో 59 ప్రాంతాలను అర్బన్ ఫారెస్టు పార్కులుగా, మిగిలిన 70 ప్రాంతాలను అటవీ అభివృద్ధి జోన్లుగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. 59 పార్కుల్లో ఇప్పటికే 15 పార్కులను ప్రజలకు వినియోగంలోకి తీసుకువచ్చిన ట్లు తెలిపారు. మరో 23 పార్కుల పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఇందులో నాలుగు పార్కులు ఈ నెలఖారున నాటికి ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇక మిగిలిన 21 పార్కులకు సంబంధించి టెండర్లు ఖరారు కావడంతో పాటు పనులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు.

ఎన్నికలు, కోడ్ పేరుతో కొనసా గుతున్న పనులను ఆలస్యం చేయవద్దని సూచించారు. వీలైనంత త్వరగా అన్ని పార్కులను దశల వారీగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నవంబర్ నెలఖారు ను డెడ్‌లైన్‌గా పెట్టుకొని పనులు చేయాలని లక్షానికి అనుగుణంగా ముందుకు సాగాలని సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సాంకేతికతను, సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాలన్నారు. 59 పార్కులకు సంబంధించిన ప్రత్యేకతలు, సమాచారంతో విడివిడిగా బుక్‌లెట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలన్నారు.

అలాగే ప్రతి పార్కులో సహజమైన అటవీ సంపద దెబ్బతినకుండా సందర్శకులకు తగిన సౌకర్యాలు ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. పర్యాటకశాఖ చేపట్టాల్సిన పనులు ఆలస్యమవుతుండడంతో వాటిని కూడా అటవీశాఖకు బదిలీ చేసేందుకు సమావేశంలో అమోదం లభించింది. సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, అటవీ ప్రధాన సంరక్షణ అధికారి ప్రశాంత్‌కుమార్ ఝా, మెట్రోరైల్ ఎండి ఎన్‌విఎస్.రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ ఎండి డి.రఘువీర్, సిఎంఓ ఓఎస్‌డి ప్రియాంక వర్గీస్, అదనపు పిసిసిఎఫ్ ఆర్‌ఎం.డోబ్రియేల్, చంద్రశేఖర్‌రెడ్డి, ఈటీపిఆర్‌ఐఎం డి.కల్యాణ్‌చక్రవర్తి, సలహాదారు డి.ముఖరీ తదితలు పాల్గొన్నారు.

Activities for the formation of Urban Forrests Parks

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అర్బన్ ఫారెస్ట్ పార్కులు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: