నకిలీ ఐపిఎస్ అరెస్టు…

  చిన్ననాటి కోరిక నెరవేర్చుకోవాలని ఎన్‌ఐఎ ఎఎస్‌పిగా వేషం, మోసం డమ్మీ పిస్టల్, నకిలీ డాక్యుమెంట్లు స్వాధీనం హైదరాబాద్ : పోలీస్ అధికారి కావాలన్న తన చిన్ననాటి కలను సాకారం చేసుకోలేక నకిలీ ఐపిఎస్ అధికారి అవతారం ఎత్తి మోసాలకు పాల్పడుతున్నకార్నాటి గురువినోద్ కుమార్ రెడ్డి అలియాస్ వినోద్‌ను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నకిలీ ఐపిఎస్ అధికారి నుంచి డమ్మీపిస్టల్, నకిలీ (ఎన్‌ఐఎ) కమాండెంట్ ఐడెంటిటీకార్డ్, రెండు రబ్బర్ స్టాంప్స్, ఎన్‌ఐఎ […] The post నకిలీ ఐపిఎస్ అరెస్టు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చిన్ననాటి కోరిక నెరవేర్చుకోవాలని ఎన్‌ఐఎ ఎఎస్‌పిగా వేషం, మోసం
డమ్మీ పిస్టల్, నకిలీ డాక్యుమెంట్లు స్వాధీనం

హైదరాబాద్ : పోలీస్ అధికారి కావాలన్న తన చిన్ననాటి కలను సాకారం చేసుకోలేక నకిలీ ఐపిఎస్ అధికారి అవతారం ఎత్తి మోసాలకు పాల్పడుతున్నకార్నాటి గురువినోద్ కుమార్ రెడ్డి అలియాస్ వినోద్‌ను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నకిలీ ఐపిఎస్ అధికారి నుంచి డమ్మీపిస్టల్, నకిలీ (ఎన్‌ఐఎ) కమాండెంట్ ఐడెంటిటీకార్డ్, రెండు రబ్బర్ స్టాంప్స్, ఎన్‌ఐఎ డైరి, ఐపాడ్, హెచ్‌పి ల్యాప్‌టాప్, డిఎంఎస్ బూట్లు, పాటే బైనాక్యూలర్, హెచ్‌డి ప్రొజెక్టర్, ఆరు మోబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కడప జిల్లాలోని కాశినాయన మండల పరిధిలోని వడ్డెమానుకు చెందిన వినోద్ తండ్రి మాజీ సైనికుడు గురివిరెడ్డి తన పదవీ విరమణాంతరం ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో నివాసమేర్పరుచుకున్నాడు.

ఈ క్రమంలో వినోద్ గిద్దలూరు పట్టణంలోని ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రి పూర్తిచేశాడు. చిన్ననాటి నుంచి పోలీసు శాఖలో ఉన్నతస్థాయి అధికారి కావాలన్న తన కలలను సాకారం చేసుకునేందుకు 2017లో హైదరాబాద్‌కు చేరుకున్నాడు. నగరంలోని అశోక్‌నగర్‌లో గది అద్దెకు తీసుకుని ఆర్‌సి రెడ్డి కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతూ యూపిఎస్‌సి, ఐఎఫ్‌ఎస్, ఎపిపిఎస్‌సి, గ్రూప్.1, ఎస్‌ఐ పరీక్షలను రాశాడు. తన గదిలోని తోటి స్నేహితులు పోలీసుశాఖ, రెవెన్యూ తదితర విభాగాల్లో ఉద్యోగాలు సాధించడం, తాను తరచూ పరీక్షలలో ఫెయిల్ కావడంతో అసహనానికి గురయ్యాడు. బంధువులు, చిన్ననాటి స్నేహితులు, తన రూం మేట్స్ తరచూ ఇంకా ఉద్యోగం రాలేదా అని అడుగుతుండటంతో ఎయిర్ ఫోర్స్ ఫ్లైయింగ్ అధికారిగా నకిలీ ఐడి కార్డు తయారు చేసి బంధుమిత్రులను నమ్మించాడు. అందరూ వినోద్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైయింగ్ అధికారి అని నమ్మేశారు.

అయినవారికి అబద్డాలు చెప్పినప్పటికి వాటిని నిజం చేసేందుకు 2016లో సివిల్ సర్వీస్ పరీక్షలు రాశాడు. అందులో ప్రిలిమినరిలో ఫెయిల్ అయ్యాడు.అయితే తల్లితండ్రులకు, బంధుమిత్రులకు తాను ఐపిఎస్‌గా సెలక్ట్ అయ్యానని నమ్మించాడు. ఐపిఎస్ అధికారిగా నకిలీ ఐడెంటిటి కార్డు తయారు చేసుకున్నాడు. అంతేకాకుండా లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్(ఎల్‌బిఎస్‌ఎన్‌ఎఎ)ముస్సోరిలో శిక్షణ తీసుకుంటున్నట్లు నమ్మబలికాడు. 2017లో వినోద్‌పై ప్రశాశం జిల్లా గిద్దలూరులో నకిలీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారిగా పలువురిని మోసం చేసిన కేసు నమోదైంది. ఈ కేసులో జైలుకు వెళ్లాడు. తదుపరి గేట్ ఆఫ్ డిఫెన్సెస్ మేనేజ్‌మెంట్ కాలేజీలోకి వెళ్లే ప్రయత్నం చేయగా, అక్కడి సెక్యూరిటీ వినోద్‌ను ప్రశ్నించారు. దీంతో తాను ఎన్‌ఐఎ అసిస్టెంట్ కమాండెంట్ నంటూ ఐడికార్డు చూపించాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అది నకిలీ కార్డుగా గుర్తించి నేరెడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై 419,448,468,471 సెక్షన్ల కింద కేసు నమోదైంది.

ఈ కేసులోనూ జైలుకు వెళ్లాడు…
అనంతరం గోల్కొండ క్రాస్ రోడ్ సమీపంలోని పురుషోత్తం అపార్ట్‌మెంట్స్‌లోకి తన మకాం మార్చేశాడు. తిరిగి చిన్నప్పటి కల పోలీస్ అధికారి ఉద్యోగం సాధించేందుకు తిరిగి ఆర్‌సి రెడ్డి కోచింగ్ సెంటర్‌లో చేరాడు. ఆర్‌సిరెడ్డి కోచింగ్‌లో సివిల్స్‌కు శిక్షణ తీసుకుంటున్న సమయంలో తాను ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లైయింగ్ అఫీసర్ నంటూ పలువురిని పరిచయడం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్‌సి రెడ్డి కోచింగ్ సెంటర్లో సోషియాలజీ ఫ్యాకల్టీ, ఆర్మీ మేజర్ గేదెల శ్రీనివాసరావును సైతం తాను ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లైయింగ్ అఫీసర్‌నంటూ నమ్మిం చాడు. దీంతో ఇద్దరూ మంచి మిత్రులుగా మారిపోయారు.

ఈ క్రమంలో మేజర్ ఇంటి నుంచి డమ్మీ పిస్టల్ చోరికి గురైంది. దీంతో అనుమానం వచ్చిన మేజర్ ఎన్‌ఐఎ అధికారులను సంప్రదించాడు. దీంతో వినోద్ నకిలీ అధికారుల అవతారం బట్టబయలైంది. రైల్వే టికెట్ల రిజర్వేషన్స్, సినిమా హాల్స్, టోల్‌గేట్స్, ప్రముఖ ఆలయాలలో విఐపి హోదాలో దర్శనాలు, పోలీస్ స్టేషన్లకు డ్రస్‌లో వెళ్లి పైరవీలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నకిలీ ఐపిఎస్ గుట్టును రట్టు చేసిన సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ రాధాకిషన్ రావు, ఇతర అధికారులు సాయిని శ్రీనివాసరావు, కె.శ్రీనివాసులు పనితీరును సిపి అంజనీకుమార్ మీడియా సమావేశంలో అభినందించారు. నకిలీ ఐపిఎస్, ఎన్‌ఐఎ, ఎయిర్ ఫోర్స్ ఫ్లైయింగ్ అధికారిగా అవతారం ఎత్తిన కార్నాటి గురువినోద్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు.

Fake IPS Arrested

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నకిలీ ఐపిఎస్ అరెస్టు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: