ఐదేళ్లలోనే సాధ్యమైన అద్భుతం…

  మిషన్ భగీరథకు కేంద్ర బృందం ప్రశంస హైదరాబాద్ : మిషన్ భగీరథ పథకం తెలంగాణ రాష్ట్రానికి ఒక వరప్రదాయని అని కేంద్ర తాగునీటి సరఫరా విభాగం డిప్యూటీ సలహాదారు టి. రాజశేఖర్ అన్నారు. ఈ పథకాన్ని చేపట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత ప్రశంసించినా తక్కువేనని వ్యాఖ్యానించారు. చాలా రాష్ట్రాలు బోరు బావుల ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తుండగా, కొత్త ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం మాత్రం కేవలం ఐదేళ్ళ కాలంలోనే ప్రతి ఇంటికి కుళాయి […] The post ఐదేళ్లలోనే సాధ్యమైన అద్భుతం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మిషన్ భగీరథకు కేంద్ర బృందం ప్రశంస

హైదరాబాద్ : మిషన్ భగీరథ పథకం తెలంగాణ రాష్ట్రానికి ఒక వరప్రదాయని అని కేంద్ర తాగునీటి సరఫరా విభాగం డిప్యూటీ సలహాదారు టి. రాజశేఖర్ అన్నారు. ఈ పథకాన్ని చేపట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత ప్రశంసించినా తక్కువేనని వ్యాఖ్యానించారు. చాలా రాష్ట్రాలు బోరు బావుల ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తుండగా, కొత్త ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం మాత్రం కేవలం ఐదేళ్ళ కాలంలోనే ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని అందించడం శుభపరిణామం అని ఆయన పేర్కొన్నారు.
గురువారం సిద్దిపేట జిల్లాలో కేంద్ర తాగునీటి అధికారుల బృందం పర్యటించింది.

ఈ సందర్భంగా గజ్వేల్ మండలం కోమటి బండ మిషన్ భగీరథ పంపుహౌస్‌ను రాజశేఖర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నదీ జలాల ద్వారా ఇంటింటికి తాగునీటి సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని ప్రశంసించారు. ఈ పథకానికి రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మనస్తూర్తిగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు వెనుక సిఎం కెసిఆర్ పడిన తపన, శ్రమ అడుగడుగునా కనిపిస్తోందన్నారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం రానున్న కాలంలో దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఆదర్శంకానుందన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు మిషన్ భగీరథ ప్రాజెక్టును అమలు చేయడానికి కార్యాచరణ ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయన్నారు. అనంతరం కోమటిబండ నుంచి తాగునీరు సరఫరా అయ్యే తీరును మ్యాప్‌తో ఈఈ రాజయ్య కేంద్ర అధికారుల బృందానికి వివరించారు. పంప్‌హౌజ్ మొత్తం తిరిగి నిర్మాణాలన్నింటిని రాజశేఖర్ చూశారు. ఆ తరువాత మర్కుక్ మండలం ఎర్రవెల్లి, దాతర్పల్లిలోని భగీరథ తాగునీటి సరఫరా వ్యవస్థను ఆయన పరిశీలించారు.

అక్కడనున్న గ్రామస్థుల స్పందనను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి సిద్దిపేట మండలం ముండ్రాయిలో 24 గంటల తాగునీరు సరఫరా అవుతున్న గంగిరెద్దులోళ్ళ కాలనీని సందర్శించారు. అక్కడ కూడా 24 గంటల పాటు తాగునీరు అందించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిరంతర పర్యవేక్షణ, తపణ ఉంటే తప్ప రోజంతా నీరు ఇవ్వడం సాధ్యంకాదన్నారు. తదనంతరం రాజశేఖర్ అధికారుల బృందం ఎల్లుపల్లికి చేరుకున్నారు. అక్కడ కూడా గ్రామస్థులను ఆయన స్వయంగా కలుసుకుని ప్రాజెక్టు గురుంచి, నీటి సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు.

మిషన్ భగరీథ ద్వారా రోజంతా నీరు అందుతోందని పలువురు గ్రామస్థులు ఆయనకు వివరించరు. అనంతరం రాజశేఖర్ మాట్లాడుతూ, మిషన్ భగీరథ ప్రాజెక్టును అమలు చేస్తున్న విధానం గొప్పగా ఉందన్నారు. నీరు వృధా కాకుండా ఫ్లో కంట్రోల్ వాల్వ్ విధానం విప్లవాత్మకమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఇప్పటికే బీహార్ రాష్ట్రం కూడా ఘర్…ఘర్‌కో పీనేకా పానీ పథకాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. మరో ఏడు రాష్ట్రాలు కూడా ఇదే బాటలో పయనించడానికి సిద్దంగా ఉన్నట్లు తమ వద్ద సమాచారముందన్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రజలకు సురక్షితమైన తాగునీరు ఇవ్వడాన్ని కర్తవ్యంగా భావించాలన్నారు. రెండు రోజుల క్షేత్రస్థాయి పర్యటనలో తాను గమనించిన అంశాలపై కేంద్ర తాగునీటి శాఖకు నివేదిక అందిస్తానన్నారు. ఈ పర్యనలో విషన్ భరీరథ చీఫ్ ఇంజనీర్ చక్రవర్తి, కన్సల్‌టెంట్ నర్సింగ్‌రావు, గజ్వేల్ ఈఈలు సిద్దయ్య, శ్రీనివాస చారి, రాజేశ్వర్‌రావు, నాగార్జున, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Central Team Appreciate Mission Bhagiratha

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఐదేళ్లలోనే సాధ్యమైన అద్భుతం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: