గ్రేటర్‌లో పచ్చదనానికి అధికారుల పక్కా ప్లాన్…

  *కోటి మొక్కలు నాటేందుకు జోనల్ స్థాయిలో కమిటీలు *కమిటీల ద్వారా నర్సరీల్లో మొక్కల పరిశీలన *ఎన్జీవో, కాలనీ సంఘాల సహకారంతో మొక్కల పెంపకం *కాలుష్య నివారణకు అధికారుల ప్రత్యేక దృష్టి సిటీ: మహానగరంలో పచ్చదనం వికసించేలా బల్దియా అధికారులు కోటి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 60 లక్షల మొక్కల ను నర్సరీల ద్వారా, మరో 40 లక్షల మొక్కలను ప్రైవేటు నర్సరీల పెంపకం చేపట్టనున్నారు. అందుకు సంబంధించిన కమిటీలను, ఎక్కడ మొక్కలు నాటాల్లో, […] The post గ్రేటర్‌లో పచ్చదనానికి అధికారుల పక్కా ప్లాన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

*కోటి మొక్కలు నాటేందుకు జోనల్ స్థాయిలో కమిటీలు

*కమిటీల ద్వారా నర్సరీల్లో మొక్కల పరిశీలన
*ఎన్జీవో, కాలనీ సంఘాల సహకారంతో మొక్కల పెంపకం

*కాలుష్య నివారణకు అధికారుల ప్రత్యేక దృష్టి

సిటీ: మహానగరంలో పచ్చదనం వికసించేలా బల్దియా అధికారులు కోటి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 60 లక్షల మొక్కల ను నర్సరీల ద్వారా, మరో 40 లక్షల మొక్కలను ప్రైవేటు నర్సరీల పెంపకం చేపట్టనున్నారు. అందుకు సంబంధించిన కమిటీలను, ఎక్కడ మొక్కలు నాటాల్లో, ఏవిధంగా కార్యక్రమం నిర్వహించాలనే అంశంపై స్థానిక అధికారులు చర్యలు చేపట్టారు.

అందులో భాగంగా నగరంలో ఉన్న నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను పరిశీలించి అవి నాణ్యత వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి సర్కిల్, జోనల్ స్థాయిలో రెండు కమిటీలను వేశారు. సర్కిల్ స్థాయిలో డిప్యూటీ కమిషనర్, అర్బన్ బయోడైవర్సిటీ ఉన్నతాధికారి, రవాణావిభాగం ఇంజనీర్లు, జోనల్ స్థాయిలో జేసీ, బయోడైవర్సీటీ డిడి, సిటీ ప్లానర్లు మెంబర్‌గా ఉంటారు. వీరంతా పదిరోజుల్లో నర్సరీలను పరిశీలించి కమిషనర్‌కు వివరాలు అందజేయాలి. జోనల్ అధికారులు కూడా నర్సరీలను పర్యవేక్షించి అక్కడ పెంచుతున్న మొక్కలు వివరాలతో అవి మేరకు ఎదుగుల ఉంటాయో వంటి విషయాలను తెలియజేస్తారు. ప్రభుత్వ నర్సరీలతో పాటు ,ప్రైవేటు నర్సరీలను పరిశీలించాలి. బయోడైవర్సిటీ అధికారులు తప్పకుండా రెండు నర్సరీలకు వెళ్లాలి. సంబంధించి నివేదికలను వారం రోజుల్లో కమిషనర్‌కు సమర్పించాలి.

ఈ కమిటీలు ఈనెల చివరిలోగా, జూన్ 10లోగా రెండు పరిశీలించి ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం నివేదిక ఇవ్వాలి. మొక్కలు నాటే ఏరియాలను గుర్తించేందుకు స్థానిక డిసిలు కాలనీ సంక్షేమ సంఘం, స్వచ్ఛంద సంస్థలు, పాఠశాల యాజమాన్యాలతో సమావేశం జరిపి వారి సహకారంతో ప్రణాళికలు రూపొందించుకోవాలి. మొక్కలు మెయిన్ రోడ్లు, కాలనీ రోడ్లు, నాలా పక్కన నాటేందుకు గుర్తించాలని, ఈ ప్రాంతాల్లో ఎన్ని మొక్కలు నాటాల్లో ముందుగా ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. అంతేగాకుండా ప్రభుత్వం పేదల కోసం నిర్మించి కాలనీలో తప్పకుండా నాటాలని అధికారులు పేర్కొంటున్నారు.

నగరంలో 616 జీహెచ్‌ఎంసీకి చెందిన బహిరంగ ప్రదేశాల్లో హరితహారం మొక్కలను నాటడం ద్వారా పార్కులుగా రూపొందించవచ్చన్నారు. గత పదేళ్ల కితం ఏర్పాటు చేసిన 331 ట్రీ పార్కుల్లో ఉన్న ఖాళీ స్థ్దలంలో హరితహారం మొక్కలను నాటాలని, దీంతో పాటు శ్మశాన వాటికల్లోని ఖాళీస్థలంలో నాటడంలో పాటు గత హరితహారంలో చేపట్టిన ప్లాంటేషన్ గ్యాపుల్లో తిరిగి నాటేందుకు ప్లాన్ చేస్తున్నట్లు బయోడైవర్సీటీ అధికారులు వివరిస్తున్నారు. ఈ ఏడాదిలో కోటి మొక్కల కార్యక్రమం విజయవంతమైతే భవిష్యత్తులో నగరంలో కాలుష్యం బారి నుంచి తప్పించుకోవచ్చని, ఈ కార్యక్రమానికి నగర ప్రజలు తమవంతుగా సహకారం అందిస్తే ఆశించిన స్థ్దాయిలో మొక్కలు నాటే కార్యక్రమం సక్సెస్ అవుతుందని పేర్కొంటున్నారు.

Plants for the prevention of pollution

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గ్రేటర్‌లో పచ్చదనానికి అధికారుల పక్కా ప్లాన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: