భూ కబ్జాదారులపై కన్నెర్ర…

  *ఆస్తులపై దృష్టి పెట్టిన జలమండలి *అక్రమ కట్టడాల కూల్చివేతలు *రూ. 5 కోట్ల ఆస్తిని కాపాడిన జలమండలి విజిలెన్స్ అధికారులు సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ప్రతిష్ఠాత్మకంగా మంచినీటిని సరఫరా చేస్తున్న జలమండలి ఆస్తులపై దృష్టి పెట్టింది. సంస్థ ఎక్కడెక్కడ ఏ మేరకు ఆస్తులు ఉన్నాయన్న అంశంపై లెక్కలు తేల్చేందుకు సిద్ధమైంది. ఈ భూ కబ్జాబారీన పడ్డ ఆస్తులపై నిఘా విధించింది. ము ఖ్యంగా సంస్థ్ధ ఆస్తులను పరక్షించుకునే విషయంలో ఎండి ఎం. దానకిషోర్ […] The post భూ కబ్జాదారులపై కన్నెర్ర… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

*ఆస్తులపై దృష్టి పెట్టిన జలమండలి
*అక్రమ కట్టడాల కూల్చివేతలు
*రూ. 5 కోట్ల ఆస్తిని కాపాడిన జలమండలి విజిలెన్స్ అధికారులు

సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ప్రతిష్ఠాత్మకంగా మంచినీటిని సరఫరా చేస్తున్న జలమండలి ఆస్తులపై దృష్టి పెట్టింది. సంస్థ ఎక్కడెక్కడ ఏ మేరకు ఆస్తులు ఉన్నాయన్న అంశంపై లెక్కలు తేల్చేందుకు సిద్ధమైంది. ఈ భూ కబ్జాబారీన పడ్డ ఆస్తులపై నిఘా విధించింది. ము ఖ్యంగా సంస్థ్ధ ఆస్తులను పరక్షించుకునే విషయంలో ఎండి ఎం. దానకిషోర్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. క్రమంగా వాటిని ఆక్రమదారుల చెర నుంచి విడిపించేందుకు విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. దీంతో సంబంధిత అధికారులు నగర పోలీసు సహకారంతో అక్రమ కట్టడాలను కూలివేసి సంస్ధ ఆస్తులను స్వాధీనపర్చుకుంది. దీంతో ఇప్పటి వరకు దాదాపుగా రూ. 5 కోట్ల విలువ చేసే ఆస్తులను పరిరక్షించుకోగలిగారు.

ఇప్పటికే..
జలమండలి విజిలెన్స్ అధికారులు నల్లా కనెక్షన్ల జారీ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారి చిట్టాను వెలుగులోకి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా నల్లా కనెక్షన్లు జారీ చేసిన అధికారులకు సంబంధించిన నివేదికను ఎండి దృష్టికి సమర్పించినట్టు సమాచారం. అంతే కాకుండా సంస్ధకు నష్టం కలిగించే విధంగా వ్యవహరించిన ఇద్దరు మేనేజర్లకు సంబంధించిన రిపోర్టును కూడా విజిలెన్స్ అధికారులు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అదే విధంగా అక్రమ నల్లా కనెక్షన్లు, అక్రమ సీవరేజీ కనెక్షన్లను ఎరివేత చర్యలను ముమ్మరం చేశారు. అందుకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అక్రమ నీటి వినియోగందారుల వెన్నులో వణుకుపుట్టిస్తున్నది విధితమే.

తాజా దాడుల్లో..
జలమండలి ఎండి ఎం. దాన కిషోర్ ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు గురువారం నిర్వహించిన దాడుల్లో దాదాపుగా రూ. 3 కోట్లు విలువ చేసే ఆస్తులను పరిరక్షించుకున్నారు. గండిపేట మంచినీటి కాలువ మీద అక్రమ నిర్మాణాలను విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి క్చూలివేశారు.
టోలిచౌకిలోని జానకి నగర్‌లో జలమండలికి సంబంధించిన గుండిపేట కాల్వ మీద, కాల్వకు అనుకుని ఉన్న ప్రాంతంలో కొంత మంది యథేచ్ఛగా అక్రమ నిర్మానాలు చేపట్టి ఆ స్థలాన్ని కబ్జా చేశారు. ఈ మేరకు జలమండలి ఎండికి ఫిర్యాదులు అందాయి. రా వాటర్ చానల్‌పైన ఉస్మాన్‌సాగర్ నుంచి ఆసీఫ్‌నగర్ వెళ్లే ప్రాంతంలోని విలువైన స్థలాన్ని కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు కబ్జా చేశారు. వాస్తవానికి కాలువ మీద, దాని పరిసర 50 అడుగుల వరకు ఎలాంటి కట్టడాలు నిర్మించకూడదు. కానీ ఆక్రమణదారులు ఏకంగా కట్టడాలను నిర్మించి వాటిలో వ్యాపారాలు సాగిస్తున్నట్టు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. దీనిపై ఎండి త్రీవంగా స్పందించడంతో జలమండలి విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసులు, జలమండలి ఓ అండ్ ఎం భోజగుట్ట జనరల్ మేనేజరు ఎం. సుజాత, ఉస్మాన్‌సాగర్ డీజీఎం ఎం. వెంటకరావులతో కలిసి కబ్జాకు గురైన సంస్ధలోని అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఇందుకు బాధ్యులైన ముగ్గురు వ్యక్తులపై జలమండలి అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Water Council that focuses on assets

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భూ కబ్జాదారులపై కన్నెర్ర… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: