సిఆర్‌ఒలను నియమించాలి

  న్యూఢిల్లీ : ప్రమాద నిర్వహణ పద్ధతులను మెరుగుపరిచేందుకు గాను రూ.5 వేల కోట్ల సామర్థం కల్గిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్‌బిఎఫ్‌సి)లు తప్పనిసరిగా సిఆర్‌ఒ(చీఫ్ రిస్క్ ఆఫీసర్)లను నియమించుకోవాలని ఆర్‌బిఐ ఆదేశాలు జారీ చేసింది. ఐఎల్ అండ్ ఎఫ్‌స్ సంస్థ రుణ సంక్షోభం, ఇది ఇతర ఎన్‌బిఎఫ్‌సిలపై ప్రభావం చూపిన నేపథ్యంలో ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఈ నిర్ణయం తీసుకుంది. సమస్యల నిర్వహణ చర్యలు, వేగవంతంగా పరిష్కరించేందుకు ఎన్‌బిఎఫ్‌సిలు సిద్ధమవ్వాలని, దీనికి గాను స్వతంత్రంగా వ్యవహరించే […] The post సిఆర్‌ఒలను నియమించాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ : ప్రమాద నిర్వహణ పద్ధతులను మెరుగుపరిచేందుకు గాను రూ.5 వేల కోట్ల సామర్థం కల్గిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్‌బిఎఫ్‌సి)లు తప్పనిసరిగా సిఆర్‌ఒ(చీఫ్ రిస్క్ ఆఫీసర్)లను నియమించుకోవాలని ఆర్‌బిఐ ఆదేశాలు జారీ చేసింది. ఐఎల్ అండ్ ఎఫ్‌స్ సంస్థ రుణ సంక్షోభం, ఇది ఇతర ఎన్‌బిఎఫ్‌సిలపై ప్రభావం చూపిన నేపథ్యంలో ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఈ నిర్ణయం తీసుకుంది. సమస్యల నిర్వహణ చర్యలు, వేగవంతంగా పరిష్కరించేందుకు ఎన్‌బిఎఫ్‌సిలు సిద్ధమవ్వాలని, దీనికి గాను స్వతంత్రంగా వ్యవహరించే సిఆర్‌ఒలను నియమించుకోవాల్సిన అవసరం ఉందని ఆర్‌బిఐ పేర్కొంది. ఇన్వెస్ట్‌మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీలు, ఇన్‌ఫ్రా ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలను దృష్టిలో పెట్టుకుని ఆర్‌బిఐ ఈ ఆదేశాలు చేసింది.

స్థిరమైన పదవీకాలం
బోర్డు ఆమోదంతో స్థిరమైన పదవీకాలంతో సిఆర్‌ఒలను నియమించుకోవాలి. ఒకవేళ ఆ అధికారి పదవీ కాలం పూర్తయిన తర్వాత బదలీ చేయడం, లేదా తొలగించడం చేయాలంటే బోర్డు అనుమతి ఉండాలి. ముందస్తు బదలీల విషయాన్ని ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఎన్‌బిఎఫ్‌సి పర్యవేక్షణ విభాగానికి తెలియజేయాలి. సిఆర్‌ఒల కార్యనిర్వహణలో మార్పు చేసినట్లయితే లిస్టెడ్ ఎన్‌బిఎఫ్‌సిలు తప్పనిసరిగా స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం అందివ్వాలి.

రూ.50 వేల కోట్ల మూలధనం కోరిన ప్రభుత్వాన్ని కోరిన పిఎస్‌యు బ్యాంక్

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(201920) గానూ రూ.50,000 కోట్ల మూలధనాన్ని అందజేయాలని ప్రభుత్వరంగ బ్యాంకులు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎకనామిక్స్ టైమ్స్ కథనం ప్రకారం, అధిక రీక్యాపిటలైజేషన్ కేటాయింపుతో బ్యాంకుల రుణ వృద్ధిని మరింత పెంచుకోవడంతో పాటు ద్రవ్య కొరత సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని పిఎస్‌యు బ్యాంకులు భావిస్తున్నాయి. అయితే మరింతగా మూలధనం అవసరం ప్రతిపాదినపై ఆర్థిక మంత్రిత్వశాఖ అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం. మే 23 తరువాత ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ ఏడాదిలో కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో బ్యాంకులకు ఎలాంటి కేటాయింపులు జరగలేదు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌బీల్లోకి కేంద్ర ప్రభుత్వం రూ.1.06 లక్షల కోట్ల మేర నిధులను చొప్పించింది. వాస్తవానికి తొలుత ప్రభుత్వం పిఎస్‌బిలకు మూలధన సాయంగా రూ.65,000 కోట్లు ఇవ్వాలని అనుకుంది. అయితే బ్యాంకుల్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా కేంద్రం ఈ మొత్తాన్ని దశల వారిగా ఈ మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లింది. గత ఆర్థిక సంవత్సరంలో ఐబిసి చట్టం ద్వారా మొండిబకాయిలు రెట్టింపు వసూళ్లను సాధించాయి. ప్రభుత్వం రూ.35,000 కోట్ల వసూళ్లను అంచనా వేయగా, రూ.70,000 కోట్ల వసూళ్లు వచ్చాయి.

PSU banks seek Rs 50,000 crore capital infusion in FY20

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సిఆర్‌ఒలను నియమించాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: