హువావేపై ట్రంప్ ఆంక్షలు

భద్రతా అంశాల సాకుతో విదేశీ సంస్థల అణచివేత: చైనా న్యూఢిల్లీ : గూఢచర్యం చేస్తోందంటూ చైనాకు చెందిన టెలికమ్యూనికేషన్స్ పరికరాల సంస్థ హువావేపై అమెరికా నిషేధం దిశగా అడుగులు వేస్తోంది. అమెరికా నెట్‌వర్క్‌లో హువావే ఉత్పత్తుల వినియోగంపై ట్రంప్ యంత్రాంగం ఆంక్షలు విధించింది. వైట్‌హౌస్ ప్రకటనలో ప్రత్యేకించి ఏ కంపెనీ పేరును పేర్కొనలేదు, కానీ ఈ ప్రకటన హువావేని లక్షంగా చేసుకునే స్పష్టంగా తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. విదేశీ శత్రువుల […] The post హువావేపై ట్రంప్ ఆంక్షలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

భద్రతా అంశాల సాకుతో విదేశీ సంస్థల అణచివేత: చైనా

న్యూఢిల్లీ : గూఢచర్యం చేస్తోందంటూ చైనాకు చెందిన టెలికమ్యూనికేషన్స్ పరికరాల సంస్థ హువావేపై అమెరికా నిషేధం దిశగా అడుగులు వేస్తోంది. అమెరికా నెట్‌వర్క్‌లో హువావే ఉత్పత్తుల వినియోగంపై ట్రంప్ యంత్రాంగం ఆంక్షలు విధించింది. వైట్‌హౌస్ ప్రకటనలో ప్రత్యేకించి ఏ కంపెనీ పేరును పేర్కొనలేదు, కానీ ఈ ప్రకటన హువావేని లక్షంగా చేసుకునే స్పష్టంగా తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. విదేశీ శత్రువుల నుంచి దేశంలోని కంప్యూటర్ నెట్‌వర్క్‌కు ముప్పు ఉండటంతో వైట్‌హౌస్ ఈ ప్రకటన చేసింది. దీంతో అమెరికా కంపెనీలు విదేశీ టెలికమ్ సేవలను వినియోగించలేని పరిస్థితి ఏర్పడింది. జాతీయ భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా పేర్కొంటోంది. హువావే చైనా కోసం గూఢచర్యం చేస్తోందని అమెరికా, మిత్రా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు హువావే 5జి నెట్‌వర్క్‌ను వినియోగించ వద్దని మిత్రదేశాలపై అమెరికా తీవ్రమైన ఒత్తిడి తెస్తోంది. ట్రంప్ చర్యను ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ఛైర్మన్ అజిత్ పై స్వాగతించారు. అమెరికా నెట్‌వర్క్‌ను కాపాడుకోవడానికి ఇది సరైన చర్య అని అన్నారు. అయితే నేషనల్ ఎమర్జెన్సీ నిర్ణయంతో ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా సంస్థల నుంచి హువావే ఎటువంటి సాంకేతికతను కొనుగోలు చేయకూడదు.

పారిశ్రామిక విద్రోహ చర్య : చైనా
అమెరికా తీరుపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశీ వ్యాపారాలను అణచి వేసేందుకు భద్రతా అంశాలను సాకుగా వాడుకోవడం పారిశ్రామిక విద్రోహ చర్య అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై బీజింగ్ విమర్శలు గుప్పించింది. అమెరికా ఇలాంటి చర్యలను మానుకుని, వ్యాపార పరంగా మెరుగైన వాతావరణం కల్పిస్తే మంచిదని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి లు కాంగ్ హితవు పలికారు. తాము వ్యాపారం చేయకుండా అమెరికా అడ్డుకుంటే వారి వినియోగదారులు, కంపెనీలే ఇబ్బంది పడతాయని చైనా పేర్కొంది. తమతో వ్యాపారం చేయకుండా ఉన్నంత మాత్రాన అమెరికా భద్రంగా ఏమీ ఉండదని పేర్కొంది. తమతో వ్యాపారం వదులుకొని ఖరీదైన ప్రత్యామ్నాయాలవైపు అమెరికా మళ్లుతోందని తెలిపింది. కాగా భద్రతా పరంగా తమ ఉత్పత్తులతో ఎలాంటి ముప్పు లేదని హువావే ఖండించింది. అమెరికాతో సత్సంబంధాలను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.

Trump declares over threats to US tech amid Huawei

Related Images:

[See image gallery at manatelangana.news]

The post హువావేపై ట్రంప్ ఆంక్షలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: