వృద్ధి వ్యూహంలో మార్పుండదు

సిబ్బందికి ఇండిగో సిఇఒ లేఖ న్యూఢిల్లీ : ఇండిగో వృద్ధి వ్యూహంలో ఎలాంటి మార్పుండదని, దీనిని అమలు చేసేందుకు కంపెనీ బోర్డు డైరెక్టర్లకు విమాన సంస్థ యాజమాన్యం నుంచి పూర్తి మద్దతు ఉందని కంపెనీ సిఇఒ రోనోజాయ్ దత్తా సిబ్బందికి పంపిన ఇమెయిల్‌లో పేర్కొన్నారు. ప్రైవేటు విమానయాన సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రమోటర్ల మధ్య విభేదాలపై మీడియాలో వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన ఈ లేఖ రాశారు. విమాన సంస్థకు చెందిన ఇద్దరు ప్రమోటర్లు రాహుల్ భాటియా, […] The post వృద్ధి వ్యూహంలో మార్పుండదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

సిబ్బందికి ఇండిగో సిఇఒ లేఖ

న్యూఢిల్లీ : ఇండిగో వృద్ధి వ్యూహంలో ఎలాంటి మార్పుండదని, దీనిని అమలు చేసేందుకు కంపెనీ బోర్డు డైరెక్టర్లకు విమాన సంస్థ యాజమాన్యం నుంచి పూర్తి మద్దతు ఉందని కంపెనీ సిఇఒ రోనోజాయ్ దత్తా సిబ్బందికి పంపిన ఇమెయిల్‌లో పేర్కొన్నారు. ప్రైవేటు విమానయాన సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రమోటర్ల మధ్య విభేదాలపై మీడియాలో వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన ఈ లేఖ రాశారు. విమాన సంస్థకు చెందిన ఇద్దరు ప్రమోటర్లు రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌కు చెందిన ఇండిగో ఎయిర్‌లైన్‌కు దేశీయంగా 44 శాతం మార్కెట్ ఉంది. ‘విమాన సంస్థ వృద్ధి వ్యూహంలో ఎలాంటి మార్పుండదని హామీ ఇస్తున్నాను. బోర్డుకు యాజమాన్యం పూర్తి అండగా ఉంది’ అని దత్తా అన్నారు.

8 శాతం పతనమైన షేరు విలువ
ఈ విభేదాల కారణంగా మార్కెట్లు షేరు విలువ భారీగా పతనమైంది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేరు విలువ 8.41 శాతం పతనమై రూ.1,475 వద్ద స్థిరపడింది.

IndiGo CEO writes to staff over the promoters spat

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వృద్ధి వ్యూహంలో మార్పుండదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: