బిఎండబ్లు నుంచి కొత్త కారు ఎక్స్5

  న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎండబ్లు సరికొత్త కారు ఎక్స్5ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. న్యూ జనరేషన్ ఎక్స్5 ఎస్‌యువి ప్రారంభ ధర రూ.72.9లక్షలుగా నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కారును బిఎండబ్లు ఇండియా గ్రూప్ ప్రెసిడెంట్ హన్స్-క్రిస్టియన్, మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కలిసి లాంఛ్ చేశారు. దేశీయ మార్కెట్లో అత్యంత ఎక్కువగా అమ్ముడయ్యే కార్ల మోడళ్లలో బిఎండబ్లు ఎక్స్5 ఒకటి, ఈ కారు మెర్సిడెస్ బెంజ్ జిఎస్‌ఇ, వోల్వో ఎక్స్‌సి90, […] The post బిఎండబ్లు నుంచి కొత్త కారు ఎక్స్5 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎండబ్లు సరికొత్త కారు ఎక్స్5ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. న్యూ జనరేషన్ ఎక్స్5 ఎస్‌యువి ప్రారంభ ధర రూ.72.9లక్షలుగా నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కారును బిఎండబ్లు ఇండియా గ్రూప్ ప్రెసిడెంట్ హన్స్-క్రిస్టియన్, మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కలిసి లాంఛ్ చేశారు. దేశీయ మార్కెట్లో అత్యంత ఎక్కువగా అమ్ముడయ్యే కార్ల మోడళ్లలో బిఎండబ్లు ఎక్స్5 ఒకటి, ఈ కారు మెర్సిడెస్ బెంజ్ జిఎస్‌ఇ, వోల్వో ఎక్స్‌సి90, రేంజ్‌రోవర్ వెలార్, పోర్షే కయెన్నీ, ఆడి క్యూ7తో పోటీపడనుంది. గత వెర్షన్‌లలానే ఎక్స్5 న్యూజనరేషన్ కారు కూడా భారత వినియోగదారులను ఆకట్టుకుంటుందని హన్స్ విశ్వాసం వ్యక్తం చేశారు. బిఎండబ్లు 2017లో 9800 యూనిట్లు విక్రయించగా, 2018లో ఈ సంఖ్య 11,105 యూనిట్లకు పెరిగింది. అంటే 13 శాతం మేరకు విక్రయాలను పెంచుకుంది.

BMW Launched the new car X5 in Indian market

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బిఎండబ్లు నుంచి కొత్త కారు ఎక్స్5 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: