ఆఫీసులోనూ ఇలా చేస్తే…

  ఉద్యోగినులు ఇంట్లో, ఆఫీసులో పనిచేస్తూ.. వ్యాయామానికి సమయం కేటాయించుకోలేరు. కాస్త ఆలోచిస్తే పనిచేసే చోట కూడా సులువుగా వ్యాయామాలు చేయొచ్చు. అవేంటంటే…! * పవర్ న్యాప్ ఆరోగ్యానికి ఎంత మంచి దో చెప్పక్కర్లేదు. అలానే గంటలు గంటలు కూర్చునేవారు పవర్ వాక్ చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. కాసేపు నిదానం గా, మరికాసేపు వేగంగా.. నడవడం అలవాటు చేసుకోవాలి. * కూర్చునే చోట మంచినీళ్ల సీసా అందరూ పెట్టుకుంటారు. నిజానికి సీసా పె ట్టుకోకుండా దాహం […] The post ఆఫీసులోనూ ఇలా చేస్తే… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఉద్యోగినులు ఇంట్లో, ఆఫీసులో పనిచేస్తూ.. వ్యాయామానికి సమయం కేటాయించుకోలేరు. కాస్త ఆలోచిస్తే పనిచేసే చోట కూడా సులువుగా వ్యాయామాలు చేయొచ్చు. అవేంటంటే…!

* పవర్ న్యాప్ ఆరోగ్యానికి ఎంత మంచి దో చెప్పక్కర్లేదు. అలానే గంటలు గంటలు కూర్చునేవారు పవర్ వాక్ చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. కాసేపు నిదానం గా, మరికాసేపు వేగంగా.. నడవడం అలవాటు చేసుకోవాలి.

* కూర్చునే చోట మంచినీళ్ల సీసా అందరూ పెట్టుకుంటారు. నిజానికి సీసా పె ట్టుకోకుండా దాహం వేసిన ప్రతిసారీ ప్యాం ట్రీకి వెళ్లి తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా మాటిమాటికీ చేయండి.

* ల్యాప్‌టాప్‌తో పని చేసుకునేవారు…. ని ల్చుని పని చేసుకునేలా కాస్త ఎత్తుగా ఉన్న డెస్కుని ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివల్ల న డుముకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. వె న్ను మీద భారం పడకుండా ఉంటుంది

* పనిమీద శ్రద్ధ పెట్టడం వల్ల ధ్యాస మిగ తా వాటి మీద ఉండదు. అందుకే గంటకోసారి అలారం పెట్టుకోవాలి. ఫిట్‌నెస్ కోసం పెట్టుకున్న ఈ అలారం మోగినప్పుడు చే తులు లేదంటే కాళ్లూ, మెడా కదుపుతూ ఉండాలి.

* అవిసెగింజలూ, బాదం, ఖర్జూరం, నట్స్ వంటివి ఆఫీసు ర్యాకులో పెట్టుకోవాలి. ఇవి తక్షణశక్తిని అందిస్తాయి. గ్యాస్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.

 

Work in the Office and make Time for Exercise

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆఫీసులోనూ ఇలా చేస్తే… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.