ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ తేదీలలో అయోమయం

  హైదరాబాద్ : ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలపై స్పష్టత లేకపోవడంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. ఈ నెల 16 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు మొదట ప్రకటించగా, ఫలితాల్లో తప్పులు దొర్లడంతో ఫెయిలైన విద్యార్థుల పునఃపరిశీలన చేయాల్సి ఉండడంతో ఈ నెల 25 నుంచి ప్రారంభమవుతాయని షెడ్యూల్ వెల్లడించింది. ఈ నెల 26న బిట్స్ పిలానీ పరీక్షలు ఉండటం, 27న జెఇఇ అడ్వాన్స్‌డ్ నిర్వహిస్తుండటంతో మళ్లీ పరీక్షల తేదీలను పునఃసమీక్షించి షెడ్యూల్ ప్రకటిస్తామని ఇంటర్ […] The post ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ తేదీలలో అయోమయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలపై స్పష్టత లేకపోవడంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. ఈ నెల 16 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు మొదట ప్రకటించగా, ఫలితాల్లో తప్పులు దొర్లడంతో ఫెయిలైన విద్యార్థుల పునఃపరిశీలన చేయాల్సి ఉండడంతో ఈ నెల 25 నుంచి ప్రారంభమవుతాయని షెడ్యూల్ వెల్లడించింది. ఈ నెల 26న బిట్స్ పిలానీ పరీక్షలు ఉండటం, 27న జెఇఇ అడ్వాన్స్‌డ్ నిర్వహిస్తుండటంతో మళ్లీ పరీక్షల తేదీలను పునఃసమీక్షించి షెడ్యూల్ ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు తెలిపింది. ఇప్పటి వరకూ పరీక్షలను తేదీలను ప్రకటించలేదు. పరీక్షల్లో తప్పిన విద్యార్థుల పునఃపరిశీలన మార్కులను హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 27న వెల్లడించనున్నారు. ఈ నెల 28 నుంచి పరీక్షలు 28 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకూ అధికారికంగా సప్లిమెంటరీ పరీక్షల తేదీలను మాత్రం ఖరారు చేయలేదు.

TS Inter Supplementary Exam 2019 Postponed to May 25

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ తేదీలలో అయోమయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: