ఎత్తిపోతలకు అయ్యే కరెంటు ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది: సిఎం కెసిఆర్

  హైదరాబాద్: ప్రతీ ఏడాది దాదాపు 540 నుంచి 600 టిఎంసిల నీళ్లను ఎత్తిపోసి 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలకు నీరు అందించాలని సిఎం కెసిఆర్ తెలిపారు. ఎత్తిపోతల పథకాలకు వినియోగించే కరెంటు కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సిఎం కెసిఆర్ వెల్లడించారు. ఎత్తిపోతల పథకాల ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలు పరిశీలించాలని, వచ్చే నెల 10 లోగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. జూన్ నుంచి డిసెంబర్ […] The post ఎత్తిపోతలకు అయ్యే కరెంటు ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది: సిఎం కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: ప్రతీ ఏడాది దాదాపు 540 నుంచి 600 టిఎంసిల నీళ్లను ఎత్తిపోసి 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలకు నీరు అందించాలని సిఎం కెసిఆర్ తెలిపారు. ఎత్తిపోతల పథకాలకు వినియోగించే కరెంటు కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సిఎం కెసిఆర్ వెల్లడించారు. ఎత్తిపోతల పథకాల ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలు పరిశీలించాలని, వచ్చే నెల 10 లోగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. జూన్ నుంచి డిసెంబర్ వరకు గోదావరి నీటిని లిప్టు చేసే అవకాశం ఉంటుందని, డిసెంబర్ మాసంలో కూడా ఒక లిప్టు నడిపి కొంత నీరు తీసుకోవచ్చని దీమా వ్యక్తం చేశారు. సరిపడే విద్యుత్ ను సరఫరా చేయడానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలని సిఎం కెసిఆర్ సూచించారు. రివర్స్ పంపింగ్ ద్వారా ఒక టిఎంసిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు, మరో టిఎంసి మల్లన్న సాగర్ కు లిప్టు చేయాలన్నారు. వచ్చే ఏడాది ఎల్లంపల్లి వరకు 3 టిఎంసిలు, కొండపోచమ్మ సాగర్ వరకు 2 టిఎంసిల నీటిని తరలించి రిజర్వాయర్లను, చెరువులను నింపుతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతిపాదించిన 22 లక్షల ఎకరాలకు మాత్రమే కాకుండా శ్రీరాంసాగర్ ఆయకట్టుకు, గుత్ప- అలీసాగర్ పథకాలకు, నిర్మల్- ముధోల్ నియోజకవర్గాలకు, గౌరపల్లి ద్వారా బాద్ నియోజకవర్గానికి నీరివ్వాలన్నారు.

Government paid of Lift Irrigation power costs

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎత్తిపోతలకు అయ్యే కరెంటు ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది: సిఎం కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: