పొడిచర్మంతో జాగ్రత్త…

  ఈ కాలంలో పొడి చర్మం వారిని ఎన్నో సమస్యలు వేధిస్తుంటాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటిస్తుంటే ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు. * పొడి చర్మతత్వం ఉన్నవారు స్నానానికి గోరు వెచ్చటినీళ్లు వాడాలి. అలానే తక్కువ నీళ్లు ఉపయోగించాలి. షవర్ స్నానం జోలికి వెళ్లకూడదు. లేదంటే చర్మంపై సహజ నూనెలు, తేమ తగ్గిపోతాయి. * తేనెలో చక్కెర కలిపి చర్మానికి మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం తాజాగా ఉంటుంది. తేమ […] The post పొడిచర్మంతో జాగ్రత్త… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఈ కాలంలో పొడి చర్మం వారిని ఎన్నో సమస్యలు వేధిస్తుంటాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటిస్తుంటే ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు.
* పొడి చర్మతత్వం ఉన్నవారు స్నానానికి గోరు వెచ్చటినీళ్లు వాడాలి. అలానే తక్కువ నీళ్లు ఉపయోగించాలి. షవర్ స్నానం జోలికి వెళ్లకూడదు. లేదంటే చర్మంపై సహజ నూనెలు, తేమ తగ్గిపోతాయి.
* తేనెలో చక్కెర కలిపి చర్మానికి మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం తాజాగా ఉంటుంది. తేమ అందుతుంది.
* రాత్రిపూట పడుకునే ముందు పాలలో దూదిని ముంచి ముఖం తుడుచుకోవాలి. పాలలోని లాక్టిక్ యాసిడ్ గుణాలు చర్మానికి అందుతుంది. చర్మం తాజాగా, తేమగా మారుతుంది.
* రెండు చెంచాల తేనెలో మూడు చెంచాల ఆలివ్ నూనె, నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి మర్దన చేసుకోవాలి. ఇరవై నిమిషాలయ్యాక గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకుంటే సరి!
* రెండు చెంచాల పాల పొడిలో చిటికెడు పసుపు, చెంచా తేనె కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. కొద్దిసేపయ్యాక తడి టిష్యూతో తుడిచేస్తే చాలు.

Precautions for Dry Skin

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పొడిచర్మంతో జాగ్రత్త… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.