ప్రేమ జంట ఆత్మహత్య…

  కొండపాక: ప్రేమజంట ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని లకుడారం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కుకూనూర్‌పల్లి ఎస్సై పరమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం లకుడారం గ్రామానికి చెందిన మంజే కనకయ్య(21), అదే గ్రామానికి చెందిన రాచకొండ తారా(19) గత కొంత కాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వీరి ప్రేమ వ్యవహారం ఇరువురి కుటుంబ సభ్యులకు, పెద్దలకు తెలియడంతో వారిని మందలించారు. గతంలో రెండు సంవత్సరాల క్రితం ఇదే విషయంలో గ్రామ పెద్దలు పంచాయితీ […] The post ప్రేమ జంట ఆత్మహత్య… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కొండపాక: ప్రేమజంట ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని లకుడారం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కుకూనూర్‌పల్లి ఎస్సై పరమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం లకుడారం గ్రామానికి చెందిన మంజే కనకయ్య(21), అదే గ్రామానికి చెందిన రాచకొండ తారా(19) గత కొంత కాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వీరి ప్రేమ వ్యవహారం ఇరువురి కుటుంబ సభ్యులకు, పెద్దలకు తెలియడంతో వారిని మందలించారు. గతంలో రెండు సంవత్సరాల క్రితం ఇదే విషయంలో గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టి కనకయ్యకు జరిమనా కూడా విధించారన్నారు. అయిన కూడా వారి ప్రేమ వ్యవహరం కొనసాగుతూ వచ్చింది. కులాలు వేరు కావడంతో ఇరువురి కుటుంబ సభ్యులు ఒప్పుకోరని భావించి ప్రేమికులు ఇద్దరు బుధవారం ఇంట్లో ఎవరికి చెప్పకుండా చదువుకున్న పాఠశాల తరగతి గదిలోకి వెళ్ళి ముందుగా వెంట తెచుకున్న విషం సేవించి అనంతరం అదే గదిలో ఒకే తాడుకు ఇద్దరు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

బుధవారం సాయంత్రం నుండి వీరిద్దరు కనిపించక పోవడంలో కుటుంబ సభ్యులు, స్థానికులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో పాఠశాల భవనం నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు లోపలికి చూడగా ప్రేమికులిద్దరు పైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ విషయం పై సమాచారం అందుకున్న కుకూనూర్‌పల్లి ఎస్సై పరమేశ్వర్ సంఘటన స్థలానికి చేరుకుని శవాలకు పంచానామ నిర్వహించి కేసు నమోదు చేసుకొని, అనంతరం పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పహారా నిర్వహిస్తున్నారు.

Love couple suicide

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రేమ జంట ఆత్మహత్య… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: