డెంగ్యూ వ్యాధి నివారణకు కృషి…

  ఎంజిఎం: వైద్య ఆరోగ్యశాఖతో పాటు కార్పొరేషన్, ఇతర ప్రభుత్వ విభాగాలు, ప్రజల సహకారంతో డెంగ్యూ వ్యాధి నివారణకు కృషి చేస్తున్నట్లు డిఎంహెచ్‌ఒ డాక్టర్ బి.హరీష్‌రాజ్ పేర్కొన్నారు. గురువారం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా కాకతీయ వైద్య కళాశాల నుండి నిర్వహించిన ర్యాలిని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2018లో జిల్లాలో 145 డెంగ్యూ పాజిటివ్‌లు నమోదయ్యాయని, 2019లో ఇప్పటి వరకు పాజిటివ్‌లు లేవని, చికిత్స అందించడం ద్వారా మరణాలు నివారించగలిగామని […] The post డెంగ్యూ వ్యాధి నివారణకు కృషి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఎంజిఎం: వైద్య ఆరోగ్యశాఖతో పాటు కార్పొరేషన్, ఇతర ప్రభుత్వ విభాగాలు, ప్రజల సహకారంతో డెంగ్యూ వ్యాధి నివారణకు కృషి చేస్తున్నట్లు డిఎంహెచ్‌ఒ డాక్టర్ బి.హరీష్‌రాజ్ పేర్కొన్నారు. గురువారం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా కాకతీయ వైద్య కళాశాల నుండి నిర్వహించిన ర్యాలిని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2018లో జిల్లాలో 145 డెంగ్యూ పాజిటివ్‌లు నమోదయ్యాయని, 2019లో ఇప్పటి వరకు పాజిటివ్‌లు లేవని, చికిత్స అందించడం ద్వారా మరణాలు నివారించగలిగామని తెలిపారు. ఎడిస్ ఈజిస్టు దోమ కాటు వలన డెంగ్యూ వ్యాపిస్తుందని, ప్రతివారం డ్రైడేగా పాటించి తమ ఇంటి చుట్టుపక్కల నీటిని నిలువ ఉండకుండా చూడాలని, అలాగే నీటిని నిలువ ఉంచే డ్రమ్ములు, పాత్రలను వారానికి ఒకసారి ఖాళీచేసి, ఆర బెట్టి వాడుకోవాలని కోరారు.

వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, కార్పొరేషన్ అర్బన్ మలేరియా సిబ్బందితో నిర్వహించిన ర్యాలీ ఐఎంఎ వరకు కొనసాగించి. అన్ని పిహెచ్‌సిలు, యుపిహెచ్‌సిలలో కూడా ర్యాలీలు, అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ ర్యాలీలో జోనల్ మలేరియా అధికారి డాక్డర్ మదన్‌మోహన్‌రావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజారెడ్డి, డిప్యూటి డిఎంహెచ్‌ఒ ఎండి.యాకూబ్‌పాషా, ఐకె జిల్లా మలేరియా అధికారి క్రిష్ణారావు, ఎన్‌సిడి పోగ్రాం అధికారి ఉమశ్రీ, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్‌రెడ్డి, సబ్‌యూనిట్ అధికారులు అజయ్‌కుమార్, లింగమూర్తి, సోమేశ్వర్ హెచ్‌ఎస్ రామ్మోహన్, మున్సిపల్ హెల్త్ విభాగం నుండి మధుకర్ తదతరులు పాల్గొన్నారు.

Dengue Disease Prevention activities

Related Images:

[See image gallery at manatelangana.news]

The post డెంగ్యూ వ్యాధి నివారణకు కృషి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: