సామాజిక చైతన్యంతోనే డెంగ్యూ నివారణ

రాజన్న సిరిసిల్ల : సామాజిక చైతన్యంతోనే డెంగ్యూ వైరస్‌ను అరికట్టగలమని డిఎంహెచ్‌ఓ డా. పి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గురువారం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. డెంగ్యూ జ్వరాలపై ప్రజలను చైతన్య పరుస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో డిఎంహెచ్‌ఓ చంద్రశేఖర్ మాట్లాడారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రెండు మూడు గ్రామాల్లో ప్రస్తుతం 46 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా […] The post సామాజిక చైతన్యంతోనే డెంగ్యూ నివారణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రాజన్న సిరిసిల్ల : సామాజిక చైతన్యంతోనే డెంగ్యూ వైరస్‌ను అరికట్టగలమని డిఎంహెచ్‌ఓ డా. పి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గురువారం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. డెంగ్యూ జ్వరాలపై ప్రజలను చైతన్య పరుస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో డిఎంహెచ్‌ఓ చంద్రశేఖర్ మాట్లాడారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రెండు మూడు గ్రామాల్లో ప్రస్తుతం 46 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా డెంగ్యూ వైరస్ పాజిటివ్ రావడం అనేది తన సర్వీస్‌లో మొదటి సారిగా చూస్తున్నానన్నారు. డెంగ్యూ వైరస్ అత్యధిక ఉష్ణోగ్రతలో కూడా జీవించడం అనేది మొదటి సారి చూస్తున్నామని, రానున్న జూన్, జూలై వర్షాకాలంలో డెంగ్యూ  ప్రభావం మరింతగా  ఉండే ప్రమాదం ఉన్నందని ఆయన చెప్పారు. వారానికి ఒకరోజు డ్రైడే నిర్వహించి నిలువ నీటిని తొలగించాలని ఆయన సూచించారు. పాత్రలన్నీ ఎండిన తరువాతే వాడాలని ఆయన పేర్కొన్నారు. దోమల లార్వాను ఇంటివద్ద ఉత్పత్తి కాకుండా నివారించ గలిగితే ,డెంగ్యూ నివారణకు తీసుకునే చర్యలు సత్ఫలితాలు ఇస్తాయన్నారు. ప్రజల సహకారం ఉంటేనే డెంగ్యూ వైరస్‌పై విజయం సాధించగలమని ఆయన తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Dengue Prevention With Social Consciousness

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సామాజిక చైతన్యంతోనే డెంగ్యూ నివారణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: