గర్భిణిని రక్షించిన ఆటోవాలా

  దిస్పూర్: అసోంలోని ఓ ఆటో డ్రైవర్ మతం కన్నా మానవత్వమే గొప్పదని నిరూపించడంతో అందరూ ప్రశంసిస్తున్నారు. అసోంలోని హైలాకండీలో మత ఘర్ఘణలు చోటుచేసుకోవడంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు. దీంతో వాహనాలు, జనాలు రోడ్లపైకి రావడం లేదు. ఓ నందిత అనే హిందూ మహిళకు పురిటి నొప్పులతో బాధపడుతోంది. ఆమె భర్త 108 ఫోన్ చేసిన కూడా రాలేదు. పక్కింట్లో ఉంటున్న మక్బూల్ అనే ముస్లిం యువకుడు తన ఆటోలో గర్భిణిని తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించాడు. సరైన […] The post గర్భిణిని రక్షించిన ఆటోవాలా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దిస్పూర్: అసోంలోని ఓ ఆటో డ్రైవర్ మతం కన్నా మానవత్వమే గొప్పదని నిరూపించడంతో అందరూ ప్రశంసిస్తున్నారు. అసోంలోని హైలాకండీలో మత ఘర్ఘణలు చోటుచేసుకోవడంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు. దీంతో వాహనాలు, జనాలు రోడ్లపైకి రావడం లేదు. ఓ నందిత అనే హిందూ మహిళకు పురిటి నొప్పులతో బాధపడుతోంది. ఆమె భర్త 108 ఫోన్ చేసిన కూడా రాలేదు. పక్కింట్లో ఉంటున్న మక్బూల్ అనే ముస్లిం యువకుడు తన ఆటోలో గర్భిణిని తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించాడు. సరైన సమయంలో మహిళను తీసుకరావడంతో తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మతాలు వేరైనా మానవత్వంతో సహాయం చేసినందుకు మక్బూల్‌ని ఆ ప్రాంత ప్రజలు కొనియాడుతున్నారు. హిందూ మహిళకు సహాయం చేయడంతో మక్బూల్ హీరో అయ్యాడు. ఆ ప్రాంత డిఎస్‌పి కీర్తి జల్లి ఆస్పత్రి చేరుకొని తల్లీ బిడ్డల గురించి అడిగి తెలుసుకున్నారు. కర్ఫూలో హిందూ మహిళకు సహాయం చేసినందుకు ఆటో డ్రైవర్‌ను డిఎస్‌పి కొనియాడారు. మత సామరస్యాన్ని చాటావని ప్రత్యేకంగా ప్రశంసించారు. హైలాకండీలో చెలరేగిన మత ఘర్షణలలో ఒకరు చనిపోగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిరసనకారులు పలు వాహనాలను, దుకాణాలను ధ్వంసం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఇంటర్ నెట్ సేవలను బంద్ చేశారు.

 

Muslim Auto Driver Help to Pregnant Hindu Woman

The post గర్భిణిని రక్షించిన ఆటోవాలా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: