కొత్త ఆవిష్కరణలు చేయాలి : వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌ : నేటి యువతకు ఉపయోగంగా ఉండే కొత్త ఆవిష్కరణలు చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైంటిస్టులకు సూచించారు. ప్రతి క్షణం కొత్త విషయాలను తెలుసుకుంటూ ముందుకు సాగాలని, సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొవాలని ఆయన పేర్కొన్నారు. బేగంపేటలోని అణుశక్తి విభాగం, అణు ఖనిజ డైరెక్టరేట్ పరిశోధన సంస్థ 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం వెంకయ్య సైంటిస్టులతో భేటీ అయ్యారు. కొత్త ఆవిష్కరణలు చేయడంతో పాటు వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టాలని ఆయన తెలిపారు. కాలుష్య నివారణకు […] The post కొత్త ఆవిష్కరణలు చేయాలి : వెంకయ్యనాయుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌ : నేటి యువతకు ఉపయోగంగా ఉండే కొత్త ఆవిష్కరణలు చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైంటిస్టులకు సూచించారు. ప్రతి క్షణం కొత్త విషయాలను తెలుసుకుంటూ ముందుకు సాగాలని, సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొవాలని ఆయన పేర్కొన్నారు. బేగంపేటలోని అణుశక్తి విభాగం, అణు ఖనిజ డైరెక్టరేట్ పరిశోధన సంస్థ 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం వెంకయ్య సైంటిస్టులతో భేటీ అయ్యారు. కొత్త ఆవిష్కరణలు చేయడంతో పాటు వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టాలని ఆయన తెలిపారు. కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని, నగరాల్లో ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన చెప్పారు. గ్రామాల్లోని కాలుష్యం గురించి అణువిభాగం సైతం దృష్టి సారించాలని, గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణం, భూమిలోని మినరల్స్ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తేవాలని ఆయన స్పష్టం చేశారు.

New Inventions Should be Done : Venkaiah Naidu

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కొత్త ఆవిష్కరణలు చేయాలి : వెంకయ్యనాయుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: