మోడీ, అమిత్ షాపై చర్యలేవీ? ఇసి: సురవరం

  కోల్‌కతా: వెస్ట్ బెంగాల్ లో విధ్వంసం సృష్టించిన టిఎంసి, బిజెపిలపై సిపిఐ జాతీయ ప్రధాన కార్వదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం సురవరం మీడియాతో మాట్లాడారు. నిరసనకారులు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బెంగాలీలో చెలగాటం మాడుతున్నారని ధ్వజమెత్తారు. విధ్వంసక చర్య అనేది బెంగాల్ సంస్కృతికే అవమానమని తెలిపారు. ఒక రోజు ముందుగా ప్రచారం నిలిపివేయడంతో ఎన్నికల కమిషన్ విశ్వాసనీయత కోల్పోవడమేకాకుండా, మోడీ […] The post మోడీ, అమిత్ షాపై చర్యలేవీ? ఇసి: సురవరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కోల్‌కతా: వెస్ట్ బెంగాల్ లో విధ్వంసం సృష్టించిన టిఎంసి, బిజెపిలపై సిపిఐ జాతీయ ప్రధాన కార్వదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం సురవరం మీడియాతో మాట్లాడారు. నిరసనకారులు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బెంగాలీలో చెలగాటం మాడుతున్నారని ధ్వజమెత్తారు. విధ్వంసక చర్య అనేది బెంగాల్ సంస్కృతికే అవమానమని తెలిపారు. ఒక రోజు ముందుగా ప్రచారం నిలిపివేయడంతో ఎన్నికల కమిషన్ విశ్వాసనీయత కోల్పోవడమేకాకుండా, మోడీ చేతిలో కీలుబొమ్మగా మారిందని దుయ్యబట్టారు. మతం పేరు చెప్పుకొని ప్రచారం చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాలపై ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సురవరం ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన హింసకు ఆ రెండు పార్టీలు బాధ్యత వహించాలన్నారు.

 

Suravaram Sudhakar Fire on BJP, TMC between Clashes

 

The post మోడీ, అమిత్ షాపై చర్యలేవీ? ఇసి: సురవరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: