కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్‌: తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టు పనులను ఆపే ప్రసక్తే లేదని కోర్టు స్పష్టం చేసింది. మల్లన్న సాగర్ నిర్వాసితుల పిటిషన్ పై గురువారం హైకోర్టులో విచారణ చేశారు. ఈ సందర్భంగా మల్లన్న సాగర్ నిర్వాసితులు పరిహారం తీసుకోవాల్సిందేనని కోర్టు పేర్కొంది. లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టును రెండు, మూడు ఎకరాలు ఉన్న రైతుల కోసం ఆపడం పద్ధతి కాదని, పరిహారం […] The post కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌: తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టు పనులను ఆపే ప్రసక్తే లేదని కోర్టు స్పష్టం చేసింది. మల్లన్న సాగర్ నిర్వాసితుల పిటిషన్ పై గురువారం హైకోర్టులో విచారణ చేశారు. ఈ సందర్భంగా మల్లన్న సాగర్ నిర్వాసితులు పరిహారం తీసుకోవాల్సిందేనని కోర్టు పేర్కొంది. లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టును రెండు, మూడు ఎకరాలు ఉన్న రైతుల కోసం ఆపడం పద్ధతి కాదని, పరిహారం చెల్లింపులో అక్రమాలు, అన్యాయం జరిగితే కోర్టు తలుపులను తట్టొచ్చని కోర్టు నిర్వాసితులకు సూచించింది. పరిహారం తీసుకునేందుకు నిరాకరించిన అరవై మంది రైతుల పరిహారాన్ని వారి న్యాయవాదులకు అందించాలని కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో నిర్వాసితులకు పరిహారం అందజేశామని, ఈ క్రమంలో సహాయ పునరావాస ప్యాకేజీ వంద శాతం పూర్తయిందని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన 175 పిటిషన్లను విచారించేందుకు హైకోర్టు అంగీకరించింది. అన్ని పిటిషన్లను విచారిస్తామని కోర్టు స్పష్టం చేశారు.  హైకోర్టు ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం, ప్రాజెక్టు అధికారులు హర్షం వ్యక్తం చేశారు. త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని వారు స్పష్టం చేశారు.

High Court Green Signal for Kaleshwaram Project Works

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: