ఆరుగురు తాలిబన్ ఉగ్రవాదులు హతం

ఆప్ఘనిస్థాన్‌లోని బాల్ఖ్ ప్రావిన్స్‌లో గురువారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం ఉదయం భద్రతా బలగాలు, తాలిబన్ ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో తాలిబన్ గ్రూప్స్‌కు చెందిన కీలక నేతతో పాటు మరో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు వెల్లడించారు. బాల్ఖ్ ప్రావిన్స్‌లో తాలిబన్ ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా […] The post ఆరుగురు తాలిబన్ ఉగ్రవాదులు హతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆప్ఘనిస్థాన్‌లోని బాల్ఖ్ ప్రావిన్స్‌లో గురువారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం ఉదయం భద్రతా బలగాలు, తాలిబన్ ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో తాలిబన్ గ్రూప్స్‌కు చెందిన కీలక నేతతో పాటు మరో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు వెల్లడించారు. బాల్ఖ్ ప్రావిన్స్‌లో తాలిబన్ ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎధురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు వెల్లడించారు.  మృతుల్లో ఉగ్రవాద కీలక నేత ముల్లాహ్ షాదర్ ఉన్నట్లు పోలీసులు చెప్పారు. గత ఏడాది కాలంగా ఈ ప్రాంతంలో భద్రతాబలగాలకు, తాలిబన్ ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Six Taliban Terrorists Were Killed In Encounter

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆరుగురు తాలిబన్ ఉగ్రవాదులు హతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: