రాహుల్ ప్రధాని కాకపోయినా…ఇబ్బంది లేదు…

ఢిల్లీ : తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి  ప్రధాని పదవి దక్కకున్నా, తమకు ఎలాంటి ఇబ్బంది లేదని కాంగ్రెస్ అగ్ర నేత గులాం నబీ ఆజాద్ తేల్చి చెప్పారు.  ఎన్డీయే తిరిగి అధికారంలోకి రాకుండా చూడడమే  తమ ప్రథమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తమ  లక్ష్యం ఏమిటనేది ఇప్పటికే స్పష్టంగా చెప్పామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తే అప్పుడు ప్రధాని పదవి గురించి ఆలోచిస్తామని,  మిత్రపక్షాలన్నీ కలిసి ప్రధాని […] The post రాహుల్ ప్రధాని కాకపోయినా… ఇబ్బంది లేదు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ : తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి  ప్రధాని పదవి దక్కకున్నా, తమకు ఎలాంటి ఇబ్బంది లేదని కాంగ్రెస్ అగ్ర నేత గులాం నబీ ఆజాద్ తేల్చి చెప్పారు.  ఎన్డీయే తిరిగి అధికారంలోకి రాకుండా చూడడమే  తమ ప్రథమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తమ  లక్ష్యం ఏమిటనేది ఇప్పటికే స్పష్టంగా చెప్పామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తే అప్పుడు ప్రధాని పదవి గురించి ఆలోచిస్తామని,  మిత్రపక్షాలన్నీ కలిసి ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తాయని ఆయన తెలిపారు. ప్రధాని ఎవరనేే విషయాన్ని తాము వివాదాస్పదం చేయదలుచుకోలేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకే ప్రధాని పదవి కావాలని తాము పట్టుబట్టబోమని ఆయన స్పష్టం చేశారు. మహాకూటమి అధికారంలోకి వస్తుందన్న ధీమా ఉంటే, ప్రధాని అభ్యర్థి ఎవరో  చెప్పాలంటూ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. రాజ్ నాథ్ సవాల్ పై ఆజాద్ స్పందిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు.

Ghulam Nabi Azad Comments on PM Post

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రాహుల్ ప్రధాని కాకపోయినా… ఇబ్బంది లేదు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: