విపక్షాలకు కృతజ్ఞతలు తెలిపిన మమతా బెనర్జీ…

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ విపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘంపై నిరసన వ్యక్తం చేసిన సమయంలో తనకు మద్దతిచ్చిన విపక్ష మిత్రులందరికీ దీదీ తన ట్వీట్టర్ ద్వారా కృతజ్ఞతలు చెప్పారు. ఏడో దశ ఎన్నికల ప్రచార గడువు శుక్రవారంతో ముగియనుంది. అయితే టిఎంసి, బిజెపిల నడుమ చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో  పశ్చిమ బెంగాల్‌లో గురువారం రాత్రి 10 గంటల వరకే ఎన్నికల ప్రచారం చేయాలని, ఆ తర్వాత చేయొద్దని కేంద్ర […] The post విపక్షాలకు కృతజ్ఞతలు తెలిపిన మమతా బెనర్జీ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ విపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘంపై నిరసన వ్యక్తం చేసిన సమయంలో తనకు మద్దతిచ్చిన విపక్ష మిత్రులందరికీ దీదీ తన ట్వీట్టర్ ద్వారా కృతజ్ఞతలు చెప్పారు. ఏడో దశ ఎన్నికల ప్రచార గడువు శుక్రవారంతో ముగియనుంది. అయితే టిఎంసి, బిజెపిల నడుమ చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో  పశ్చిమ బెంగాల్‌లో గురువారం రాత్రి 10 గంటల వరకే ఎన్నికల ప్రచారం చేయాలని, ఆ తర్వాత చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది.

దీంతో ఇసిపై మమత ఫైర్ అయ్యారు. ఇసి నిర్ణయంపై అభ్యంతరం తెలుపుతూ ఆమె నిరసన వ్యక్తం చేశారు. దీంతో మమతకు మాయావతి, అఖిలేష్ యాదవ్, ఎపి సిఎం చంద్రబాబుతో పాటు కాంగ్రెస్ పార్టీ మద్దతును ప్రకటించింది. ఈ సందర్భంగా మమత వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. భారతీయ జనతా పార్టీ డైరెక్షన్‌లో ఇసి పని చేస్తుందని మమత మండిపడ్డారు. బిజెపికి బెంగాల్ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

mamata banerjee thanks to opposition parties

Related Images:

[See image gallery at manatelangana.news]

The post విపక్షాలకు కృతజ్ఞతలు తెలిపిన మమతా బెనర్జీ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: