అల్వార్ బాధితురాలిని పరామర్శించిన రాహుల్

రాజస్థాన్ : అల్వార్ లో అత్యాచారానికి గురైన దళిత మహిళను గురువారం జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. గురువారం రాహుల్ బాధితురాలి ఇంటికి  వెళ్లారు. బాధితురాలితో  పాటు ఆమె కుటుంబీలను పరామర్శించారు. అనంతరం రాహుల్  మీడియాతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తాను బాధితురాలికి ధైర్యం చెప్పేందుకు ఇక్కడికి వచ్చానని, రాజకీయాల కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలు చేయడానికి తాను ఇక్కడకు రాలేదని… బాధితురాలికి ధైర్యం […] The post అల్వార్ బాధితురాలిని పరామర్శించిన రాహుల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రాజస్థాన్ : అల్వార్ లో అత్యాచారానికి గురైన దళిత మహిళను గురువారం జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. గురువారం రాహుల్ బాధితురాలి ఇంటికి  వెళ్లారు. బాధితురాలితో  పాటు ఆమె కుటుంబీలను పరామర్శించారు. అనంతరం రాహుల్  మీడియాతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తాను బాధితురాలికి ధైర్యం చెప్పేందుకు ఇక్కడికి వచ్చానని, రాజకీయాల కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలు చేయడానికి తాను ఇక్కడకు రాలేదని… బాధితురాలికి ధైర్యం చెప్పేందుకు వచ్చానని అన్నారు. బాధిత కుటుంబంతో వ్యక్తిగతంగా మాట్లాడానని, తాను మాట్లాడిన విషయాలను బహిర్గతం చేయలేనని రాహుల్ తెలిపారు. రాహుల్ వెంట రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సిఎం సచిన్ పైలట్ తదితరులు ఉన్నారు.

గత నెల 26న బాధితురాలు తన భర్తతో కలిసి బైక్ పై వెళుతున్నసమయంలో ఐదుగురు దుండగులు వారిని అడ్డగించి,  బాధితురాలిపై సామూహిక అత్యాచారం చేశారు.  నిందితులు ఈ ఘటనను వీడియో తీశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఈ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతామని బాధితురాలిని బెదిరించారు. దీంతో భయపడిన బాధిత దళిత మహిళ, ఆమె భర్త మౌనంగా ఉండిపోయారు. అయితే నిందితులు అత్యాచార ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

AICC Chief Rahul Gandhi Visit to Alwar Gang Rape Victim

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అల్వార్ బాధితురాలిని పరామర్శించిన రాహుల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: