పోలవరంలో అవినీతి …

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్  నరసింహన్ తో కాంగ్రెస్  ఎంపి కెవిపి రామచంద్రరావు గురువారం ఉదయం భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరినట్టు కెవిపి తెలిపారు. ఈ మేరకు గవర్నర్ కు ఓ వినతి పత్రం సమర్పించినట్టు ఆయన వెల్లడించారు. ప్రాజెక్టులో జరిగిన  అవినీతికి కారణమైన వారిపై  చర్యలు తీసుకోవాలని కోరినట్టు ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసేందుకు కృషి […] The post పోలవరంలో అవినీతి … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్  నరసింహన్ తో కాంగ్రెస్  ఎంపి కెవిపి రామచంద్రరావు గురువారం ఉదయం భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరినట్టు కెవిపి తెలిపారు. ఈ మేరకు గవర్నర్ కు ఓ వినతి పత్రం సమర్పించినట్టు ఆయన వెల్లడించారు. ప్రాజెక్టులో జరిగిన  అవినీతికి కారణమైన వారిపై  చర్యలు తీసుకోవాలని కోరినట్టు ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. పోలవరంలో జరిగిన అవినీతిపై గవర్నర్ మరిన్ని వివరాలను అడిగారని,  తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను గవర్నర్ కు అందించానని కెవిపి తెలిపారు.  తాను గవర్నర్ కు ఇచ్చిన వినతిపత్రంలో ఎన్నో అంశాలను పొందుపర్చానని, ఈ అంశాలను పరిశీలించి చర్యలు తీసుకుంటానని గవర్నర్ తనకు హామీ ఇచ్చారని కెవిపి వెల్లడించారు.

KVP Meets Governor Narasimhan

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పోలవరంలో అవినీతి … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: