మహేశ్ ను ఓరేయ్ అన్న …

హైదరాబాద్ : వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన సినిమా మహర్షి. ఈ సినిమా మే 9న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా విజయవంతం కావడంపై అల్లరి నరేష్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ మహేశ్ బాబుకు స్నేహితుడిగా నటించారు. మహేశ్ తో కలిసి నటించడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని నరేష్ […] The post మహేశ్ ను ఓరేయ్ అన్న … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన సినిమా మహర్షి. ఈ సినిమా మే 9న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా విజయవంతం కావడంపై అల్లరి నరేష్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ మహేశ్ బాబుకు స్నేహితుడిగా నటించారు. మహేశ్ తో కలిసి నటించడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని నరేష్ తెలిపారు. సినిమాలో భాగంగా మహేశ్ తనను ఒరేయ్ అని ఒకటికి రెండు సార్లు పిలిచారని, తాను మాత్రం మహేశ్ ను ఒరేయ్ అంటూ చాలా సార్లు పిలిచానని నరేష్ పేర్కొన్నారు.  ఇలా పిలవడం తనకు ఇబ్బందిగా అనిపించిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని సినిమా దర్శకుడు  వంశీకి చెప్పానని, అయితే స్నేహితులు అన్న తరువాత అలా పిలుచుకోవడం సహజమని, మహేశ్ బాబు ఏమీ అనుకోరని వంశీ తనకు చెప్పారని అల్లరి నరేష్ పేర్కొన్నారు. మహేశ్ మంచి మనస్సును తాను చాలా దగ్గర చూశానని నరేష్ తెలిపారు.

Actor Allari Naresh Comments on Mahesh Babu

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మహేశ్ ను ఓరేయ్ అన్న … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: