సైరా సినిమాలో నటించిన రష్యా నటుడు మృతి

హైదరాబాద్: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘సైరా’ మూవీని తీస్తున్నారు. ఈసినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు రెండు సెట్లు కాలిపోవడంతో నిర్మాతకు రెండు కోట్ల మేర నష్టం వాటిల్లింది. సైరా సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేసిన అలెగ్జాండర్ (38) వడదెబ్బతో దుర్మరణం చెందాడు. రష్యా నుంచి వచ్చిన సదరు టూరిస్ట్ గచ్చిబౌలిలో ఉంటూ సైరా సినిమాలో నటిస్తున్నారు. ఎండకు తట్టుకోలేక గచ్చి బౌలిలోని డిఎల్‌ఎప్ గేట్ నెంబర్-1 సమీపంలో కళ్లు […] The post సైరా సినిమాలో నటించిన రష్యా నటుడు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘సైరా’ మూవీని తీస్తున్నారు. ఈసినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు రెండు సెట్లు కాలిపోవడంతో నిర్మాతకు రెండు కోట్ల మేర నష్టం వాటిల్లింది. సైరా సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేసిన అలెగ్జాండర్ (38) వడదెబ్బతో దుర్మరణం చెందాడు. రష్యా నుంచి వచ్చిన సదరు టూరిస్ట్ గచ్చిబౌలిలో ఉంటూ సైరా సినిమాలో నటిస్తున్నారు. ఎండకు తట్టుకోలేక గచ్చి బౌలిలోని డిఎల్‌ఎప్ గేట్ నెంబర్-1 సమీపంలో కళ్లు తిరిగిపడిపోవడంతో అలెగ్జాండర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. అతని కెమెరాలోని ఫోటోలు ఆధారంగా రెండు రోజుల నుంచి సైరా సినిమాలో నటించారని పోలీసులు గుర్తించారు. అలెగ్జాండర్ మృతిపై గోవాలో ఉన్న స్నేహితులకు సమాచారం ఇచ్చారు. ఈ సినిమాను ఏ మూర్తంలో ప్రారంభించారో కానీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయని చిరంజీవి అభిమానులు వాపోతున్నారు.

 

Junior Artist Dead with Sun Stroke in Syeraa Shooting

 

 

The post సైరా సినిమాలో నటించిన రష్యా నటుడు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: