ప్రేమజంట బలవన్మరణం

సిద్దిపేట: కొండపాక మండలం లకుడారం గ్రామంలో విషాద ఘటన జరిగింది. ఈ  గ్రామానికి చెందిన మండే కనకయ్య (21), రాచకొండ తారా (19) అనే ప్రేమ జంట బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. కనకయ్య, తాారల ప్రేమ వ్యవహారం వారి  తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో కనకయ్య, తారలను వారు మందలించారు. ఈ ప్రేమ వ్యవహారంలో గ్రామ పెద్దలు రెండేళ్ల క్రితం కనకయ్యకు 30 వేల జరిమానా కూడా విధించారు. కానీ […] The post ప్రేమజంట బలవన్మరణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

సిద్దిపేట: కొండపాక మండలం లకుడారం గ్రామంలో విషాద ఘటన జరిగింది. ఈ  గ్రామానికి చెందిన మండే కనకయ్య (21), రాచకొండ తారా (19) అనే ప్రేమ జంట బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. కనకయ్య, తాారల ప్రేమ వ్యవహారం వారి  తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో కనకయ్య, తారలను వారు మందలించారు. ఈ ప్రేమ వ్యవహారంలో గ్రామ పెద్దలు రెండేళ్ల క్రితం కనకయ్యకు 30 వేల జరిమానా కూడా విధించారు. కానీ కనకయ్య, తారలు ప్రేమించుకోవడం మానలేదు. వీరి కులాలు వేరు కావడంతో తమ ప్రేమను పెద్దలు అంగీకరించరన్న బాధతో వీరు ముందుగా పురుగుల మందు తాగారు. అనంతరం గ్రామంలో ఉన్న పాఠశాలలోని ఓ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పాఠశాల నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రేమ విఫలం కావడం వల్లనే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. శవ పరీక్ష నిమిత్తం కనకయ్య, తారల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Love Couple Commits Suicide In Lakudaram At Siddipet

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రేమజంట బలవన్మరణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: