మోడీ కనుసన్నల్లోనే ఇసి పని చేస్తోంది : మాయావతి

లక్నో : ప్రధాని నరేంద్ర మోడీ క‌నుస‌న్న‌ల్లోనే ఎన్నికల సంఘం పని చేస్తుందని బిఎస్ పి చీఫ్ మాయావతి ఆరోపించారు. ప్రధాని మోడీ, బిజెపి చీఫ్ అమిత్ షాలు పశ్చిమబెంగాల్ సిఎం మమతాబెనర్జీని టార్గెట్ గా చేసుకుని, ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాయావతి ధ్వజమెత్తారు. ఈ విధంగా వ్యవహరించడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని ఆమె పేర్కొన్నారు. ఇలా మోడీ, అమిత్ షాలు వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఈవిధంగా వ్యవహరించడం మంచి […] The post మోడీ కనుసన్నల్లోనే ఇసి పని చేస్తోంది : మాయావతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లక్నో : ప్రధాని నరేంద్ర మోడీ క‌నుస‌న్న‌ల్లోనే ఎన్నికల సంఘం పని చేస్తుందని బిఎస్ పి చీఫ్ మాయావతి ఆరోపించారు. ప్రధాని మోడీ, బిజెపి చీఫ్ అమిత్ షాలు పశ్చిమబెంగాల్ సిఎం మమతాబెనర్జీని టార్గెట్ గా చేసుకుని, ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాయావతి ధ్వజమెత్తారు. ఈ విధంగా వ్యవహరించడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని ఆమె పేర్కొన్నారు. ఇలా మోడీ, అమిత్ షాలు వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఈవిధంగా వ్యవహరించడం మంచి పరిణామం కాదని మాయావతి చెప్పారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు. బెంగాల్లో శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిషేధించారని, అయితే మోడీ బెంగాల్ లో గురువారం రెండు ర్యాలీలు  తీస్తున్నారని, అయితే ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఇసి ఎందుకు నిషేథించలేదని ఆమె ప్రశ్నించారు. బిజెపి, ప్రధాని మోడీకి అనుకూలంగా పని చేస్తున్న ఇసి ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేయడం తగిన పద్ధతి కాదని ఆమె అభిప్రాయ పడ్డారు.

BSP Chief Mayawati Comments on PM Modi and EC

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మోడీ కనుసన్నల్లోనే ఇసి పని చేస్తోంది : మాయావతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: