లారీ ఢీకొని ఇంటర్నేషనల్ స్విమ్మర్ మృతి…

చెన్నై: ఇంటర్నేషనల్ స్మిమ్మర్ గా పేరు సాధించిన భారత స్మిమ్మర్ ఎంబి బాలకృష్ణన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మంగళవారం రాత్రి చెన్నై సమీపంలో తన బైక్ పై ఇంటికి వెళ్తుండగా అతని వాహనం అదుపుతప్పడంతో ఓ లారీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో లారీ చక్రాలు అతనిపై నుంచి వెళ్లాడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. చెన్నైలోని గిండీ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదివిన బాలకృష్ణన్ పై చదువుల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఇటీవల కాలంలో జరిగిన […] The post లారీ ఢీకొని ఇంటర్నేషనల్ స్విమ్మర్ మృతి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చెన్నై: ఇంటర్నేషనల్ స్మిమ్మర్ గా పేరు సాధించిన భారత స్మిమ్మర్ ఎంబి బాలకృష్ణన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మంగళవారం రాత్రి చెన్నై సమీపంలో తన బైక్ పై ఇంటికి వెళ్తుండగా అతని వాహనం అదుపుతప్పడంతో ఓ లారీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో లారీ చక్రాలు అతనిపై నుంచి వెళ్లాడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. చెన్నైలోని గిండీ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదివిన బాలకృష్ణన్ పై చదువుల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

ఇటీవల కాలంలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో స్విమ్మింగ్ పోటీలలో పతకం సాధించిన బాలకృష్ణన్ కొన్ని రోజుల క్రితమే ఇండియాకు వచ్చాడు. అతని మృతిపై పలువురు స్విమ్మర్లు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాలకృష్ణన్ పలు ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పోటీల్లో ఎన్నో పతకాలు సాధించాడు. 2007లో గువహటిలో జరిగిన జాతీయ స్విమ్మింగ్‌ లో స్వర్ణ పతకం సాధించాడు. దక్షిణాసియా క్రీడల్లో 100మీ. 200మీ. బ్యాక్‌ స్ట్రోక్‌ విభాగాల్లో గోల్డ్ మెడల్ కొట్టాడు.

Swimmer MB Balakrishnan Dies in Road Accident

Related Images:

[See image gallery at manatelangana.news]

The post లారీ ఢీకొని ఇంటర్నేషనల్ స్విమ్మర్ మృతి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: