కమల్ పై చెప్పులతో దాడి

చెన్నయ్ : విశ్వ న‌టుడు, మ‌క్క‌ల్ నీది మయ్య‌మ్ చీఫ్ కమల్ హాసన్ పై దుండగులు చెప్పులతో దాడి చేశారు. ఈ ఘటన బుధవారం జరిగింది. ఇటీవల ఆయన హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తొలి ఉగ్రవాది హిందువేనని, అతడు నాథూరాం గాడ్సే అంటూ కమల్ వ్యాఖ్యానించారు. కమల్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, ఆర్ఎస్ఎస్, బిజెపి నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన కమల్ పై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో కమల్ పై కేసు […] The post కమల్ పై చెప్పులతో దాడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చెన్నయ్ : విశ్వ న‌టుడు, మ‌క్క‌ల్ నీది మయ్య‌మ్ చీఫ్ కమల్ హాసన్ పై దుండగులు చెప్పులతో దాడి చేశారు. ఈ ఘటన బుధవారం జరిగింది. ఇటీవల ఆయన హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తొలి ఉగ్రవాది హిందువేనని, అతడు నాథూరాం గాడ్సే అంటూ కమల్ వ్యాఖ్యానించారు. కమల్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, ఆర్ఎస్ఎస్, బిజెపి నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన కమల్ పై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో కమల్ పై కేసు కూడా నమోదైంది. కమల్ హాసన్ పై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బుధవారం మధురైలోని తిరుప్పరకుంద్రంలో జరిగిన రోడ్ షోలో కమల్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో 11 మంది దుండగులు కమల్ పై చెప్పులు విసిరారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కమల్ లోక సభ ఎన్నికల బరిలోకి దిగలేదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నారు.

Attack On Kamal Haasan With Sandals

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కమల్ పై చెప్పులతో దాడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: