ఇద్దరు ఉగ్రవాదులు ఎన్ కౌంటర్

జమ్మూకశ్మీర్ : పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య గురువారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో  ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాను అమరుడయ్యాడు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జవాన్లను ఆస్పత్రికి తరలించారు.  డాలిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతాబలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో  తారసపడిన ఉగ్రవాదులు భద్రతాబలగాలపై కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపారు. […] The post ఇద్దరు ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

జమ్మూకశ్మీర్ : పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య గురువారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో  ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాను అమరుడయ్యాడు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జవాన్లను ఆస్పత్రికి తరలించారు.  డాలిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతాబలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో  తారసపడిన ఉగ్రవాదులు భద్రతాబలగాలపై కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో డాలిపొరా ప్రాంతంలో భద్రతాబలగాలు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

Two Terrorists Encounter In Dalipora At Jammukashmir

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇద్దరు ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: