నా వల్ల ఓటింగ్ శాతం పెరగలేదు.. ప్రజల్లో చైతన్యమే కారణం

ఒక్క ఫొటోతో రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ అధికారి రీనా ద్వివేది తన వల్ల పోలింగ్ శాతం పెరిగిందనే వాదనను ఖండించారు. లక్నోలో ప్రజా పన్నుల విభాగంలో పనిచేస్తున్న రీనా.. ఐదో విడత పోలింగ్ విధులకు ఈవీఎం బాక్స్‌ను చేతిలో పెట్టుకొని వెళ్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. తానేమీ సెలబ్రిటీని కాద ని, సాధారణ మహిళనే. గతంలో రెండుసార్లు ఎన్ని కల విధులకు హాజరయ్యానని […] The post నా వల్ల ఓటింగ్ శాతం పెరగలేదు.. ప్రజల్లో చైతన్యమే కారణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఒక్క ఫొటోతో రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ అధికారి రీనా ద్వివేది తన వల్ల పోలింగ్ శాతం పెరిగిందనే వాదనను ఖండించారు. లక్నోలో ప్రజా పన్నుల విభాగంలో పనిచేస్తున్న రీనా.. ఐదో విడత పోలింగ్ విధులకు ఈవీఎం బాక్స్‌ను చేతిలో పెట్టుకొని వెళ్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. తానేమీ సెలబ్రిటీని కాద ని, సాధారణ మహిళనే. గతంలో రెండుసార్లు ఎన్ని కల విధులకు హాజరయ్యానని అన్నారు.

గతంలో కూడా పోల్ డ్యూటీ చేశానని, ఇప్పుడు సామాజిక మాధ్యమాలు ఎక్కువ కావడంతో ప్రాచుర్యం లభించిందన్నారు. ఒక పోలింగ్ కేంద్రంలో ఎంత ఓటింగ్ నమోదవుతుందనేది అక్కడి ప్రజల్లో ఉన్న చైతన్యంపైనే ఆధారపడి ఉంటుంది గానీ పసుపు రంగు చీరో.. నీలిరంగు చీరనో కట్టుకొని వస్తే ఓటింగ్ పెరగదన్నారు. ఇక మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పోలింగ్ విధులు నిర్వ ర్తించిన యోగేశ్వరి గొహితే నీలి రంగు డ్రెస్ లో పోల్ సామాగ్రి వెళుతున్న ఫొటోలు వైరల్ అ య్యాయి. ఈమె కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ప్రాచుర్యం లభిస్తోంది.

Lady Polling Officer In Yellow Saree

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నా వల్ల ఓటింగ్ శాతం పెరగలేదు.. ప్రజల్లో చైతన్యమే కారణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: