ఇరాన్‌పై అమెరికా దూకుడు!

      ఇరాన్‌పై పళ్లు పటపట కొరుకుతున్న అమెరికాకు దాని మీద మరింతగా విరుచుకుపడడానికి ఒక సాకు దొరికింది. గత ఆదివారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) వద్ద హోర్ముజ్ జలసంధి బయట నాలుగు వాణిజ్య నౌకలపై జరిగిన దాడి ఇరాన్ చర్యేనని అమెరికా ఆరోపిస్తున్నది. అది ఎవరు చేసిందో సరైన దర్యాప్తులో తేలేవరకు ఓపిక పట్టకుండా నిందను టెహరాన్‌పైకి నెట్టివేసింది. విశేషమేమిటంటే ఈ దాడిని ఇరాన్ కూడా ఖండించింది. ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ఇజ్రాయెల్ […] The post ఇరాన్‌పై అమెరికా దూకుడు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

      ఇరాన్‌పై పళ్లు పటపట కొరుకుతున్న అమెరికాకు దాని మీద మరింతగా విరుచుకుపడడానికి ఒక సాకు దొరికింది. గత ఆదివారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) వద్ద హోర్ముజ్ జలసంధి బయట నాలుగు వాణిజ్య నౌకలపై జరిగిన దాడి ఇరాన్ చర్యేనని అమెరికా ఆరోపిస్తున్నది. అది ఎవరు చేసిందో సరైన దర్యాప్తులో తేలేవరకు ఓపిక పట్టకుండా నిందను టెహరాన్‌పైకి నెట్టివేసింది. విశేషమేమిటంటే ఈ దాడిని ఇరాన్ కూడా ఖండించింది. ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ఇజ్రాయెల్ చేయించిన పనేనని ఇరాన్ అంటున్నది. ఇరాన్‌లో ఇప్పుడున్న తమకు ప్రతికూలమైన మతాధిపతుల ప్రభుత్వాన్ని తొలగింపచేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నాడు. దాడిలో స్వల్పంగా దెబ్బతిన్న నాలుగు చమురు నౌకల్లో రెండు సౌదీ అరేబియా కు చెందినవి కాగా ఒకటి నార్వేది, మరొకటి యుఎఇది. ప్రపంచం వినియోగిస్తున్న మొత్తం చమురులో ఐదో వంతు హోర్ముజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. ఈ జలాలను తాను వినియోగించకుండా అడ్డుకుంటే మొత్తం జలసంధినే మూసివేయగలనని గత నెలలో ఇరాన్ హెచ్చరించి ఉంది.

సిరియా నుంచి బలగాలను ఉపసంహరించుకుంటున్న అమెరికా నిజంగానే ఇరాన్‌పై యుద్ధానికి సిద్ధపడుతుందా లేక బెదిరింపులతో టెహరాన్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించి అక్కడ తనకు అనుకూలమైన పాలనను నెలకొల్పుకోవాలనే లక్షాన్ని నెరవేర్చుకుంటుందా? అనేది ప్రశ్న. యుద్ధానికి వెళ్లకుండా బెదిరింపుల ద్వారా, ఒత్తిడి రాజకీయాల ప్రయోగంతో తన లక్షాన్ని సాధించుకోవాలన్నదే ట్రంప్ ప్రభుత్వ మనోగతమని పరిశీలకులు భావిస్తున్నారు. అదేమైనప్పటికీ గత గురువారం నాడు జరిగిన అమెరికా అతున్నత స్థాయి జాతీయ భద్రత సమావేశంలో పశ్చిమాసియాకు లక్ష 20 వేల మంది సైనికులను పంపించాలని తాత్కాలిక రక్షణ మంత్రి ప్యాట్రిక్ షనాహన్ నిర్ణయించినట్టు తెలుస్తున్నది. సిరియా, ఇరాక్‌లలోని తన సైన్యాలపై ఇరాన్ అనుకూల శక్తులు దాడులు చేసే పక్షంలో దాని మీదికి యుద్ధానికి వెళ్లాలని అమెరికా సంకల్పించినట్టు అందుకు ముందస్తు చర్యగా ఈ సైన్యాలను అక్కడికి పంపించదలచినట్టు సమాచారం. ట్రంప్ ప్రభుత్వంలో ప్రధాన జాతీయ భద్రత సలహాదారు బోల్టన్ మాట చెల్లుబాటవుతున్నదని భావిస్తున్నారు.

ఆయన ఇరాన్‌కు బద్ధ వ్యతిరేకిగా పేరుగాంచారు. టెహరాన్‌కు శత్రువైన సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, యుఎఇ యువరాజు మొహమ్మద్ బిన్ జయేద్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ, అమెరికా అధ్యక్షుడి జాతీయ భద్రత సలహాదారు జాన్ బోల్టన్ ఈ నలుగురు ఏకమై ట్రంప్ ప్రభుత్వాన్ని ఇరాన్‌పై యుద్ధానికి తొందరపెడుతున్నారని వెల్లడవుతున్నది. ఇరాన్ మాత్రం తమ ప్రాంతా న్ని బీభత్స పూరితం చేసి ధ్వంస ధూళి చేయగల యుద్ధాన్ని తాను కోరుకోవడం లేదని చెబుతున్నది. చమురు నౌకల మీద దాడికి తమకు సంబంధం లేదని దేశాధినేత అయతొల్లా ఖమేనీ సహా ఇరాన్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. అమెరికా కావాలనే తమను రెచ్చగొడుతున్నదని వారు ఆరోపిస్తున్నారు. ఒబామా ప్రభుత్వం ఇతర మిత్రదేశాలతో కలిసి ఇరాన్‌తో కుదుర్చుకున్న అణ్వస్త్ర రహిత ఒప్పందం నుంచి ట్రంప్ ప్రభుత్వం ఏడాది క్రితం ఏకపక్షంగా తొలగిపోయి ఆంక్షలను మళ్లీ బిగించింది. ఇరాన్ చమురు ఎగుమతులను మరింతగా అడ్డుకొనే నిర్ణయానికి పాల్పడింది.

పర్యవసానంగా ఇరాన్ తన అణు సామర్థ సౌకర్యాలను పెంచుకొనే కృషిని మళ్లీ చేయదలచినట్టు వార్తలు చెబుతున్నాయి. ఇప్పుడు ఇరాన్ అణ్వస్త్ర తయారీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లకుండా చేయడానికి దాని మీద యుద్ధం ప్రకటించడమే మార్గమని ట్రంప్ సలహాదార్లు ఆయనకు సూచిస్తున్నారు. హోర్ముజ్ జలసంధిలో నాలుగు చమురు నౌకలపై దాడిని అందుకు సాకుగా చేసుకోవాలన్నది వారి అభిమతం. ఇరాన్ సమీప జలాల్లోకి వెంటనే యుద్ధ నౌకను పంపించాలని అమెరికా జాతీయ భద్రత సలహాదారు బోల్టన్ సూచిస్తున్నాడు. ఇరాన్ తప్పులు చేసేటట్టు చేయడం ద్వారా దానిపై యుద్ధానికి వెళ్లడం అనే కుత్సిత ఆలోచనతో అమెరికా ఉన్నట్టు దాని గూఢచార విభాగ మాజీ అధికారి నెడ్ ప్రైస్ వెలిబుచ్చిన అభిప్రాయం గమనించదగినది. అనివార్యమైన పరిస్థితుల్లోనే ఇరాన్‌పై యుద్ధానికి వెళ్లామని చెప్పుకోడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించే కార్యక్రమంలో ట్రంప్ యంత్రాం గం ఉన్నట్లు అర్థమవుతున్నది. అయితే గతంలో సద్దాం హుస్సేన్ సారథ్యంలోని ఇరాక్ మీద దండెత్తడానికి చూపిన మానవ విధ్వంసకర ప్రళయాస్త్రాల తయారీ సాకు అబద్ధమని తేలడం తో అమెరికా మీద ఉమ్మేసినట్టే ఇరాన్ మీద కూడా అసత్య ఆరోపణలు చేసి యుద్ధం ప్రకటిస్తే ట్రంప్ ప్రభుత్వం ప్రపంచ ప్రజల నిరసనను చవిచూడవలసి వస్తుంది.

U.S. Says Iran Likely Behind Ship Attacks

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇరాన్‌పై అమెరికా దూకుడు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: