లోక్‌సభ బరిలో విద్యావంతులు

  వైసిపి తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో 88 శాతం మంది డిగ్రీ, లేదా అంతకంటే ఎక్కువ పిజిలు చేసిన వారున్నారని ఇండియా టుడే సర్వేలో పేర్కొంది. ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో తమిళనాడుకు చెందిన డిఎంకె 87.5 శాతం డిగ్రీ హోల్డర్లతో నిలవగా, అన్నాడిఎంకె 86.4 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రం దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. తెలంగాణలో అధికార పార్టీ టిఆర్‌ఎస్ 82.4 శాతం డిగ్రీ హోల్డర్లతో […] The post లోక్‌సభ బరిలో విద్యావంతులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వైసిపి తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో 88 శాతం మంది డిగ్రీ, లేదా అంతకంటే ఎక్కువ పిజిలు చేసిన వారున్నారని ఇండియా టుడే సర్వేలో పేర్కొంది. ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో తమిళనాడుకు చెందిన డిఎంకె 87.5 శాతం డిగ్రీ హోల్డర్లతో నిలవగా, అన్నాడిఎంకె 86.4 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రం దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. తెలంగాణలో అధికార పార్టీ టిఆర్‌ఎస్ 82.4 శాతం డిగ్రీ హోల్డర్లతో రాష్ట్రంలో తొలిస్థానంలోనూ, అదే విధంగా దేశవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచింది. ఇక అలాగే ఈ జాబితాలో నామ్ తమిళర్ కట్చి 80 శాతంతో 5 వ స్థానం, సిపిఎం 78 శాతంతో 6వ స్థానం, కాంగ్రెస్ 76 శాతంతో 7వ స్థానం, తృణమూల్ కాంగ్రెస్ 75 శాతంతో 8వ స్థానం, బిజెపి 71 శాతంతో 9వ స్థానంలో నిలిచాయి. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి 139 మంది నిరక్షరాస్యులు బరిలో ఉన్నట్లు ఇండియా టుడే ఇంటెలిజెన్స్ యూనిట్ చెప్పింది. మొత్తానికి విద్యావంతులను బరిలోకి దింపిన వైసిపి దేశంలో ప్రధమ స్థానంలో నిలిచింది.

దేశ వ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలపై ఇటీవల ఇండియా టుడే ఒక ఆసక్తికరమైన సర్వే చేసింది. ఎన్నికల్లో పోటీ చేసిన లోక్‌సభ అభ్యర్థుల విద్యార్హతలపై చేసిన ఈ సర్వే ఏ రాజకీయ పార్టీ నుండి ఎక్కువ మంది విద్యావంతులు ఎన్నికల పోటీలో ఉన్నారు అనే దానిపై దృష్టి పెట్టి విశ్లేషించింది. ఈ సర్వే ప్రకారం అధిక శాతంలో విద్యావంతులను బరిలోకి దింపిన జాబితాలో దేశంలో తొలిస్థానం దక్కించుకున్న పార్టీ వైసిపిగా పేర్కొన్నది. ఈ సర్వే కోసం వారు సమర్పించిన అఫిడవిట్ పత్రాలను విశ్లేషించింది. బరిలోని అభ్యర్థులందరూ ఉన్నత విద్యనభ్యసించిన జిల్లాగా ఎపిలోని శ్రీకాకుళాన్ని పేర్కొన్నది.

వైసిపి తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో 88 శాతం మంది డిగ్రీ, లేదా అంతకంటే ఎక్కువ పిజిలు చేసిన వారున్నారని ఇండియా టుడే సర్వేలో పేర్కొంది. ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో తమిళనాడుకు చెందిన డిఎంకె 87.5 శాతం డిగ్రీ హోల్డర్లతో నిలవగా, అన్నాడిఎంకె 86.4 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రం దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. తెలంగాణలో అధికార పార్టీ టిఆర్‌ఎస్ 82.4 శాతం డిగ్రీ హోల్డర్లతో రాష్ట్రంలో తొలిస్థానంలోనూ, అదే విధంగా దేశవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచింది. ఇక అలాగే ఈ జాబితాలో నామ్ తమిళర్ కట్చి 80 శాతంతో 5 వ స్థానం, సిపిఎం 78 శాతంతో 6వ స్థానం, కాంగ్రెస్ 76 శాతంతో 7వ స్థానం, తృణమూల్ కాంగ్రెస్ 75 శాతంతో 8వ స్థానం, బిజెపి 71 శాతంతో 9వ స్థానంలో నిలిచాయి. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి 139 మంది నిరక్షరాస్యులు బరిలో ఉన్నట్లు ఇండియా టుడే ఇంటెలిజెన్స్ యూనిట్ చెప్పింది. మొత్తానికి విద్యావంతులను బరిలోకి దింపిన వైసిపి దేశంలో ప్రధమ స్థానంలో నిలిచింది.

ఆటు జాతీయ స్థాయిలోని, ఇటు ప్రాంతీయ స్థాయిలోని చిన్న రాజకీయ పక్షాలు మహిళా అభ్యర్థులకు ఎక్కువ సీట్లు ఇచ్చినట్లుగాను, అదేవిధంగా పెద్ద పార్టీలు మహిళా అభ్యర్థులకు తక్కువ సీట్లు ఇచ్చినట్లుగాను తేలింది. అందువల్ల పోటీలో పాల్గొనే మహిళా అభ్యర్థులు కేవలం 8.8 శాతం మాత్రమేనని తెలుస్తోంది. తమిళనాడులో ఒక జాతీయ పార్టీ అయిన నామ్ తమిళ్ కచ్చి అనే పార్టీ అటు పురుషులకు, ఇటు మహిళలకు సమానంగా సీట్లిచ్చిన పార్టీగా నిలిచింది. ఆ పార్టీ పోటీలో నిలిపిన మొత్తం 40 మంది అభ్యర్థుల్లో 20 మంది మహిళలు కాగా, మరో 20 మంది పురుషులు ఉన్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీకి చెందిన బ్యాకియా రాజన్ వెల్లడించారు. డెమొక్రటిక్ రిఫామ్స్ అసోసియేషన్ సేకరించిన లెక్కల ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ దాదాపుగా 34.15 శాతం మహిళా అభ్యర్థులను పోటీలో నిలబెట్టింది.

మొత్తం సీట్లలో కనీసం 40 శాతం మహిళలకు ఇవ్వాలన్న లక్ష్యాన్ని దాదాపు పూర్తి చేసుకుంది. ఈ పార్టీ నిలబెట్టిన 41 మంది అభ్యర్థులలో 34.15 శాతం మంది అభ్యర్థులు మహిళలు కాగా మిగతా వారు పురుషులు. 41 మందిలో 14 మంది మహిళలుగా ఉన్నారు. ఇక ఒడిశా లో బిజూజనతాదళ్ నాయకుడు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 33 శాతం మహిళలకు టిక్కెట్లు ఇచాచరు. బిజూజనతాదళ్ తరపున పోటీ చేస్తున్న 21 మందిలో ఏడుగురు మహిళలున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 మంది అభ్యర్థుల్లో 16 శాతం మంది అంటే నలుగురు మహిళలను పోటీలో నిలబెట్టారు. సమాజ్‌వాది పార్టీ ఐదుగురు మహిళలను 31 మంది పురుషులను పోటీలో నిలబెట్టారు. సిపిఎం నిలబెట్టిన అభ్యర్థుల్లో ఏడుగురు మహిళలున్నారు. ఈ పార్టీ తరపున మొత్తం 54 మంది పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ 328 మంది అభ్యర్థులను నిలబెట్టగా 42 మంది అంటే 12.8 శాతం అభ్యర్థులు మహిళా అభ్యర్థులు. అతి తక్కువ టికెట్లు మహిళలకు పంపిణీ చేసిన పార్టీలలో బీహార్‌కు చెందిన జనతాదళ్ , రాష్ట్రీయ జనతాదళ్ ఉన్నాయి.

ఏడు విడతలుగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో కలిపి 8049 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తాజాగా నేషనల్ ఎలక్షన్ వాచ్ , అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫారమ్స్ (ఏడీఆర్) సంస్థలు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులలో అత్యంత సంపన్నులు ఎవరు అన్నదానిపై సర్వే నిర్వహించారు. లోక్ సభ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిలో సంపన్నుల జాబితాపై సర్వే వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎంపి అభ్యర్థులుగా బరిలో ఉన్న వారి అఫిడవిట్లను ఆధారంగా చేసుకొని నిర్వహించిన సర్వేలో దేశంలోని లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అత్యంత ధనికుడైన వ్యక్తి బిహార్‌కు చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థిగా గుర్తించారు. బిహార్ కు చెందిన ఆర్కే శర్మ తన సంపద రూ.1107 కోట్లు తన అఫిడవిట్లో పేర్కొని అత్యంత ధనిక అభ్యర్థిగా తేలారు. తరువాతి రెండు, మూడు స్థానాలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కావటం విశేషం. రెండో స్థానంలో చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిలిచారు. రూ.895 కోట్లు తన అఫిడవిట్లో పేర్కొన్నారు. మూడో స్థానంలో కొండాపై పోటీ చేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి నిలవటం ఆసక్తికర అంశంగా తెలుస్తుంది.

టాప్ త్రీలో ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారే అయివున్నారు. దేశం మొత్తం మీద అత్యంత ధనిక అభ్యర్థుల్లో టాప్ త్రీ చూస్తే వారిలో ఇద్దరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వారు కూడా చేవెళ్ళ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసిన అభ్యర్థులే. మొత్తం అభ్యర్థుల్లో కోటీశ్వరులు ఎంత మంది లెక్కల్లో మాత్రం తెలంగాణ చివరి స్థానంలో నిలిచింది. పార్టీల వారీగా చూస్తే బిజెపి అభ్యర్థుల సగటు ఆస్తి రూ.13.37 కోట్లుగా ఉంటే కాంగ్రెస్ అభ్యర్థుల ఆస్తి సగటున రూ.19.92 కోట్లు, బిఎస్‌పి సగటు రూ.3.86 కోట్లు, సిపిఎం సగటు రూ.1.28 కోట్లు. ఇండిపెండెంట్ల సగటు రూ.1.25 కోట్లుగా ఉంది. రాష్ట్రాల వారీగా చూసినప్పుడు అభ్యర్థుల్లో కోటీశ్వరులు అత్యధికులు అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన వారు కావటం విశేషం. ఈ రాష్ట్రంలో బరిలో ఉన్న అభ్యర్థుల్లో 83 శాతం మంది కోటీశ్వరులే.

తర్వాతి స్థానంలో మేఘాలయ 78 శాతం, మిజోరం 67 శాతం, నాగాలాండ్, డామన్ అండ్ డయ్యూ, లక్షద్వీప్, గోవాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 50 శాతం కోటీశ్వరులే ఉన్నారు. జమ్ము కాశ్మీర్ లో 48 శాతం ఉండగా హిమాచల్‌ప్రదేశ్‌లో 47 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 42 శాతం అభ్యర్థులు కోటీశ్వరులుగా తేలారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో రెండు శాతం మంది కోటీశ్వరులు పెరిగారు. లోక్‌సభకు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కోటీశ్వరుల సంఖ్య ప్రతి ఎన్నికలకూ అంతకంతకూ పెరుగుతోంది. 2009లో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో కోటీశ్వరులు 16 శాతం ఉంటే 2014 నాటికి అది 27 శాతానికి పెరిగింది. తాజా ఎన్నికల్లో అది మరో రెండు శాతం పెరిగి 29 శాతానికి చేరింది. ఏది ఏమైనప్పటికీ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసిన అభ్యర్థుల అఫిడవిట్లను ఆధారంగా చేసుకొని నిర్వహిస్తున్న సర్వేలు పలు ఆసక్తికర అంశాలను వెల్లడిస్తున్నాయి.

88% Education candidates Compete in Lok Sabha elections

Related Images:

[See image gallery at manatelangana.news]

The post లోక్‌సభ బరిలో విద్యావంతులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: