బేటీ బచావో భేష్, భేష్!

  రాజస్థాన్‌లో మహిళలపై నేరాలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల రాజస్థాన్, అల్వార్ లోని థానాఘాజిలో ఒక మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. రాజస్థాన్ స్త్రీలకు నరకంగా మారిందని చాటి చెప్పే మరో సంఘటన ఇది. రాజస్థాన్ పోలీసుల గణాంకాల ప్రకారం చూసినా, గత కొన్నేళ్ళుగా అక్కడ అత్యాచారాల కేసులు చాలా పెరిగాయి. 2017లో రాజస్థాన్‌లో 3,305 రేప్ కేసులు నమోదయ్యాయి. 2018లో 4,335 కేసులు నమోదయ్యాయి. అంటే కేవలం ఒక్క సంవత్సరంలో 1,030 కేసులు పెరిగిపోయాయి. […] The post బేటీ బచావో భేష్, భేష్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రాజస్థాన్‌లో మహిళలపై నేరాలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల రాజస్థాన్, అల్వార్ లోని థానాఘాజిలో ఒక మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. రాజస్థాన్ స్త్రీలకు నరకంగా మారిందని చాటి చెప్పే మరో సంఘటన ఇది. రాజస్థాన్ పోలీసుల గణాంకాల ప్రకారం చూసినా, గత కొన్నేళ్ళుగా అక్కడ అత్యాచారాల కేసులు చాలా పెరిగాయి. 2017లో రాజస్థాన్‌లో 3,305 రేప్ కేసులు నమోదయ్యాయి. 2018లో 4,335 కేసులు నమోదయ్యాయి. అంటే కేవలం ఒక్క సంవత్సరంలో 1,030 కేసులు పెరిగిపోయాయి. రాజస్థాన్ మహిళల పాలిట అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా మారిందనడానికి మరో సాక్ష్యం, 2019 మొదటి నాలుగు నెలల్లోనే 1,509 రేప్ కేసులు నమోదయ్యాయి. 2015లో 3,644 రేప్ కేసులు నమోదైతే, 2016లో 3,656కి పెరిగాయి. దీన్న బట్టి ఏటా అత్యాచారాల కేసులు ఎలా పెరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.

రాజస్థాన్ పోలీసు విభాగంలోని గణాంకాలను కాస్త నిశితంగా పరిశీలిస్తే, ముఖ్యంగా 2016 గణాంకాలను అధ్యయనం చేస్తే అల్వార్ జిల్లాలోనే ఎక్కువగా అత్యాచారాల కేసులు చోటు చేసుకున్నట్లు గమనించవచ్చు. ఈ డేటా ప్రకారం 2016లో రాజస్థాన్‌లో మొత్తం 3,656 రేప్ కేసులు నమోదయ్యాయి. అందులో 239 కేసులు అల్వార్‌కు చెందినవే. భరత్‌పూర్‌లో 186 కేసులు నమోదయ్యాయి. రేప్ కేసులతో పాటు 231 లైంగిక దాడులు, భార్యల పట్ల భర్తల క్రూరమైన ప్రవర్తనకు సంబంధించి 633 కేసులు నమోదయ్యాయి. నిజానికి ఈ వివరాలన్నీ బయటకు వచ్చేవి కావు. మహిళలపై ఎన్ని నేరాలు జరుగుతున్నాయి, మహిళల పరిస్థితి ఎలా ఉందన్నది ఆలోచించేవారు లేనేలేరు. కాని అల్వార్ సామూహిక అత్యాచారం కేసు వెలుగులోకి రావడం వల్ల ఈ వివరాలపై కూడా చర్చ మొదలైంది.

అల్వార్‌లో సామూహిక అత్యాచారం సంఘటన ఏప్రిల్ 26న జరిగింది. ఆమె తన భర్తతో కలిసి వెళుతున్నది. భర్త మోటారు సైకిలు నడుపుతున్నాడు. ఆమె వెనుక కూర్చుని ఉన్నది. మోటార్ సైకిళ్ళపై వచ్చిన దుండగులు వారిని అడ్డగించి పొలాల్లోకి లాక్కెళ్ళారు. భర్తను చావబాదారు. అతని ముందే భార్యపై మూక మానభంగానికి పాల్పడ్డారు. అందులో ఒకడు ఇదంతా తన మొబైల్‌లో వీడియో కూడా తీశాడు. పోలీసుల దగ్గరకు వెళితే ఈ వీడియో బయటపెడతామని బెదిరించాడు. అంతేకాదు, ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టకుండా ఉండాలంటే తాము అడిగినంత సొమ్ము ఇవ్వాలని డిమాండ్ చేశారట. జరిగిన దారుణాన్ని పోలీసులకు ఏప్రిల్ 30వ తేదీన రిపోర్టు చేశారు. కాని పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది మే 7వ తేదీన. ఎందుకంటే, దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇలాంటి చిన్నా చితక కేసులు పట్టించుకునే తీరిక పోలీసులకు ఉండదు.

జైపూర్ ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యస్. సెంగాథీర్ ఈ విషయం గురించి మాట్లాడుతూ ఆరుగురు నిందితులను పట్టుకున్నామని, వారిని ప్రశ్నించడం జరుగుతోందని అన్నారు. కాని సిగ్గులేని రాజకీయ నాయకులకు ఈ రేప్ కేసు కూడా ఓట్లు అడుక్కునే బిచ్చపాత్రగా మారింది. రాజస్థాన్ లో ఒక దళిత మహిళపై అత్యాచారం జరిగింది కాబట్టి బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి వెంటనే కాంగ్రెస్‌తో పొత్తుకు దూరంగా ఉండాలని, మహాకూటమి నుంచి బయటకు రావాలని అన్నారు. ఒక మహిళపై జరిగిన దారుణమైన, అమానుషమైన నేరాన్ని కూడా రాజకీయాలకు వాడుకునే ఈ దిగజారుడు మనస్తత్వాన్ని ఏమనాలి? దీనికి జవాబుగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా రాజకీయాల్లో ఈ రేప్ కేసును లాక్కుని వచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ తన ప్రసంగాల్లో తనపై దాడి చేయడమే ఏకైక కార్యక్రమంగా పెట్టుకున్నారని, నిజానికి అల్వార్ రేప్ కేసు గురించి మోడీకి ఏమీ తెలియదని, ఎన్నికల్లో గెలవడానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని విమర్శించాడు.

ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందని, అల్వార్‌లో పోలీసు సూపరిండెంట్‌ను, అక్కడి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను వెంటనే తొలగించామని అన్నారు. కాని బిజెపి నాయకుడు బధానా మాత్రం బాధితురాలితోను, బాధితురాలి కుటుంబంతోను మాట్లాడి రాజీబేరాలకు ప్రయత్నించాడని విమర్శించారు. అంతేకాదు, రాజస్థాన్‌లో బిజెపి అధికారంలో ఉన్నప్పుడు మహిళలపై అనేక నేరాలు జరిగాయని, ఆ కేసుల్లో ఎక్కడా బిజెపి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా విమర్శించారు. కాని అల్వార్‌లో ఇదొక్కటే కాదు, మరో రేప్ కేసు కూడా జరిగింది. ఈ కేసు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరో కేసు గురించి అంతగా చర్చ జరగలేదు. అల్వార్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంపౌండర్, అంబులెన్స్ డ్రైవర్లు కలిసి ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ ఇద్దరిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

రాజస్థాన్‌లో బిజెపి ఇప్పుడు ప్రతిపక్షం. ధర్నాలు, నిరసనలతో హోరెత్తిస్తుంది. రాజస్థాన్ బిజెపి అధ్యక్షుడు మదన్ లాల్ సైనీతో సహా అనేకమంది బిజెపి నేతలు, మాజీ ఆరోగ్యమంత్రి కాళీచరణ్ సరాఫ్, బిజెపి ఎంఎల్‌ఎ సుమన్ శర్మ, మాజీ మేయర్ అశోక్ లాహోటీలు జైపూర్ రోడ్లపై ఆందోళనలకు దిగారు. గవర్నర్ కల్యాణ్ సింగ్ కు ఒక మెమొరాండం సమర్పించుకున్నారు. రాజస్థాన్ లో దళిత మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులకు సంబంధించిన అనేక కేసుల జాబితా ఇచ్చారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు. కాంగ్రెసు అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు దిగజారాయని, నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, కాంగ్రెస్ ఎన్నికల్లో ఓట్ల కోసం అల్వార్ రేప్ కేసు వివరాలు బయటకు రాకుండా తొక్కిపెట్టిందని ఇలా అనేక ఆరోపణలు చేశారు. బిజెపి ఎంపి కిరోరి లాల్ మీనా అల్వార్ లో భారీ ర్యాలీ తీశాడు. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలన్నాడు.

గుజరాత్‌కు చెందిన శాసనసభ్యుడు జిగ్నేష్ మేవానీ బాధిత కుటుంబాన్ని పరామర్శించాడు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని, ప్రజలకు పోలీసులు దగ్గరయ్యేలా చేస్తున్నామని ముఖ్యమంత్రి గెహ్లాట్ ప్రకటించాడు. జైపూర్‌లోని అనేక మహిళా సంఘాలు కూడా ప్రతిస్పందిస్తున్నాయి. రాజస్థాన్‌లో మహిళలకు రక్షణ లేని స్థితి ఉందని, ఈ పరిస్థితి మారాలని గొంతెత్తుతున్నారు. రాజస్థాన్ సమాజంలో పురుషాధిక్యత లోలోతున పేరుకుపోయిందని, ఈ పురుషాహంకారం సమాజం నుంచి తొలగనంతవరకు రాజస్థాన్‌లో పరిస్థితులు మారవని, ముందుగా రాజస్థాన్‌లోని సామాజిక ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలని పలువురు వాదిస్తున్నారు. ఏది ఏమైనా జమ్ము కశ్మీర్‌లో మూడేళ్ళ బాలికపై అత్యాచారం, రాజస్థాన్‌లో దళిత మహిళపై అత్యాచారం.. ఇలా అత్యాచారం వార్త లేని రోజు భారతదేశంలో ఉండడం లేదు.

                                                                                                      – రంగోలి అగర్వాల్ ( ఫస్ట్ పోస్ట్ )
With 3,644 rape cases, Rajasthan ranks 3rd in India

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బేటీ బచావో భేష్, భేష్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: