సుజలాం సుఫలాం…

  మేడారం మూడు, నాలుగు పంపుల జలధారణ వరుస విజయాల వెట్ రన్ స్విచాన్ చేసిన ఇఎన్‌సి వెంకటేశ్వర్లు, సలహాదారు పెంటారెడ్డి గతంలోనే రెండు పంపుల పరీక్ష మిగతా మూడు పంపులపై దృష్టి జూన్ రెండో వారంలోగా పూర్తిచేసే యోచన హైదరాబాద్/ధర్మారం: నంది మేడారం పంపుహౌజ్‌లో పంపుల వెట్ రన్ విజయవంతమైంది. పంపుహౌజ్‌లో మూడు, నా లుగో పంపులను కాళేశ్వరం ఇఎన్‌సి వెంకటేశ్వ ర్లు, ప్రభుత్వ సలహాదారు (ఎత్తిపోతల పథకాలు) పెంటారెడ్డి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. […] The post సుజలాం సుఫలాం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మేడారం మూడు, నాలుగు పంపుల జలధారణ

వరుస విజయాల వెట్ రన్
స్విచాన్ చేసిన ఇఎన్‌సి వెంకటేశ్వర్లు, సలహాదారు పెంటారెడ్డి
గతంలోనే రెండు పంపుల పరీక్ష
మిగతా మూడు పంపులపై దృష్టి
జూన్ రెండో వారంలోగా పూర్తిచేసే యోచన

హైదరాబాద్/ధర్మారం: నంది మేడారం పంపుహౌజ్‌లో పంపుల వెట్ రన్ విజయవంతమైంది. పంపుహౌజ్‌లో మూడు, నా లుగో పంపులను కాళేశ్వరం ఇఎన్‌సి వెంకటేశ్వ ర్లు, ప్రభుత్వ సలహాదారు (ఎత్తిపోతల పథకాలు) పెంటారెడ్డి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. బుధవారం మధ్యాహ్నం మూడో పంపును, సాయం త్రం నాలుగో పంపును ఇంజనీర్లు వెట్న్ చేసి, పరీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న నంది మేడారం (ప్యాకేజీ 6) పంపుహౌజ్‌లో ఇదివరకే మొదటి రెండు పంపులను పరీక్షించిన సంగతి తెలిసిందే. 21 రోజుల వ్యవధిలో సిద్ధంగా ఉన్న నాలుగు పంపుల వెట్న్‌న్రు విజయవంతంగా చేయడంపై ప్రభుత్వ వర్గాలు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేసాయి.

ఏప్రిల్ 24వ తేదీన మేడారంలో మొదటి పంపును పరీక్షించారు. మరుసటి రోజు 25న రెండో పంపు కు సైతం వెట్ రన్ జరిపారు. మూడు వారాల తర్వాత మే 15న మూడు, నాలుగో పంపుల వెట్న్ నిర్వహించారు. మేడారం పంపుహౌజ్‌లో 12 4.4 మెగావాట్ల సామర్థం ఉన్న ఏడు పంపుల ను భిగించారు. ఇందులో వెట్న్‌క్రు సిద్ధంగా మొ దటి నాలుగు పంపులకు వెట్న్ నిర్వహించి, పరీక్షించారు. ఈ ఖరీఫ్‌లో కాళేశ్వరం నీటితో కనీసం వెయ్యి చెరువులు నింపాలన్నది అధికారుల ప్రతిపాదన కాగా, గొలుసుకట్టులో నీరు పోస్తే, అంతకు మించిన ప్రయోజనమే రైతాంగానికి కలుగుతుందని ముఖ్యమంత్రి కెసిఆర్ యోచిస్తున్నారు.

ఇందుకోసం జూన్ రెండో వారాని కల్లా మిగిలిన మూడు పంపులను కూడా పరీక్షించి, సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి విడుదల చేసిన నీటితో నంది మేడారం సర్జ్‌పూల్ (ప్యాకేజీ 6) నిండుగా ఉంది. పంపులు ప్రారంభించి, అవసరమైన 200 ఆర్‌పిఎం (రెవల్యూషన్స్ పర్ మినట్, ఒక నిమిషంలో మోటారు తిరిగే చుట్లు) రాగానే పంపులు నీటి పంపింగ్‌ను ప్రారంభించాయి. ఒక్కో మోటారుకు 3,200 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేసే సామర్థం ఉంది. ఈ నీరంతా మేడారం రిజర్వాయర్లోకి చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టులోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ వెట్న్ కోసం అధికారుల బృందం, ఏజెన్సీలు నిరంతరం శ్రమించాయి. కాళేశ్వరం ఇంజనీర్ ఇన్ చీఫ్ నల్ల వెంకటేశ్వర్లు, సాంకేతిక సలహాదారు (ఎత్తిపోతల పథకాలు) పెంటారెడ్డి, ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ నూనె శ్రీధర్, నవయుగ డైరెక్టర్ వెంకటరామారావు, ఏఈఈలు ఉపేందర్, శ్రీనివాస్, రాకేష్, డీజీఎం శ్రీనివాసరావు, డీపీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

Pump Wet Run Successful in PumpHouse

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సుజలాం సుఫలాం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: