22న దోస్త్ నోటిఫికేషన్…

  * 23 నుంచి రిజిస్ట్రేషన్లు హైదరాబాద్ : డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల ప్రకటన వాయిదా పడింది. ఈ నెల 22న డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ(దోస్త్ )నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ నెల 23 నుంచి విద్యార్థులు దోస్త్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. బుధవారం నోటిఫికేషన్ జారీ చేయాలని ముందుగా నిర్ణయించినప్పటికీ, ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థుల రీవెరిఫికేషన్ ఫలితాలు ఈ నెల 27న విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో బుధవారం సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్ధన్‌రెడ్డి […] The post 22న దోస్త్ నోటిఫికేషన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

* 23 నుంచి రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్ : డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల ప్రకటన వాయిదా పడింది. ఈ నెల 22న డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ(దోస్త్ )నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ నెల 23 నుంచి విద్యార్థులు దోస్త్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. బుధవారం నోటిఫికేషన్ జారీ చేయాలని ముందుగా నిర్ణయించినప్పటికీ, ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థుల రీవెరిఫికేషన్ ఫలితాలు ఈ నెల 27న విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో బుధవారం సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్ధన్‌రెడ్డి అధ్యక్షతన దోస్త్ కమిటీ మరోసారి సమావేశమైంది. నోటిఫికేషన్ వాయిదా వేసి, ఈ నెల 22న జారీ చేయాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్, దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి, మరో ఛైర్మన్ వి.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Dosth notification on 22nd

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 22న దోస్త్ నోటిఫికేషన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: