శిశు విషాద దేశం మనది

  ఐదేళ్ల పిల్లల మరణాల స్థలి రాష్ట్రాల వారీగా తేడాలు నాలుగు వారాల్లోనే రాలే మొగ్గలు లాన్సెట్ అధ్యయన నివేదికలో వెల్లడి వాషింగ్టన్ : పేదల పిల్లల ప్రాణాలు గాలిలో దీపాలే అవుతున్నాయి. 2015 సంవత్సరంలో వెల్లడైన పిల్లల అకాల మరణాలతో ఈ విషయం స్పష్టం అయింది. ఆ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతదేశంలోనే అత్యధిక శిశు మరణాలు నమోదు అయ్యాయి. వైద్య విజ్ఞాన వారపత్రిక లాన్సెట్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బాలల విషాద భారతం […] The post శిశు విషాద దేశం మనది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఐదేళ్ల పిల్లల మరణాల స్థలి
రాష్ట్రాల వారీగా తేడాలు
నాలుగు వారాల్లోనే రాలే మొగ్గలు
లాన్సెట్ అధ్యయన నివేదికలో వెల్లడి

వాషింగ్టన్ : పేదల పిల్లల ప్రాణాలు గాలిలో దీపాలే అవుతున్నాయి. 2015 సంవత్సరంలో వెల్లడైన పిల్లల అకాల మరణాలతో ఈ విషయం స్పష్టం అయింది. ఆ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతదేశంలోనే అత్యధిక శిశు మరణాలు నమోదు అయ్యాయి. వైద్య విజ్ఞాన వారపత్రిక లాన్సెట్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బాలల విషాద భారతం గురించి తెలియచేసిన ఈ అధ్యయనంలోనే మరో కోణం కూడా వెలుగులోకి వచ్చింది. పేద సంపన్న దేశాలలో బాలల మరణాలపై కొట్టొచ్చే వ్యత్యాసాలు ఉన్నట్లు తేల్చారు. సగటున చూసుకుంటే పేద దేశాలలోని పిల్లలు ఎక్కువగా మృతి చెందుతున్నట్లు ఈ సందర్భంగా వెల్లడైంది. 2000 సంవత్సరం నుంచి 2015 వరకూ భారతదేశంలో సంభవించిన శిశు మరణాల గురించి అమెరికాలోని ప్రజా ఆరోగ్య అధ్యయన కేంద్రం జాన్స్ హోప్కిన్స్ బూంబెర్గ్‌కు చెందిన పరిశోధకులు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషణ నిర్వహించారు.

భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో చోటుచేసుకున్న బాలల అకాల మరణాల గురించి విస్తృతంగా అధ్యయనం చేశారు. మృతికి దారితీసిన కారణాలను ఆరా తీశారు. ఐదేళ్ల లోపు పిల్లల మరణాలను ప్రధానంగా తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో వరుసగా భారతదేశంలో శిశు మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టినా 2015 లో ప్రపంచంలోనే ఈ దుర్ఘటనకు సంబంధించి ఇండియానే మొదటి స్థానంలో ఉంది. 2000 సంవత్సరంలో శిశు మరణాలు దాదాపు 21 లక్షల వరకూ ఉన్నాయి. అయితే 2015 నాటికి ఈ సంఖ్య 11 లక్షలకు తగ్గింది. అయితే ప్రపంచంలోనే ఇది అత్యధిక బాలల మరణ సంఖ్యగా రికార్డు అయింది.

అసోంలో అత్యధికంగా బాలలు బలి
భారత దేశంలో శిశు మరణాల క్రమంలో వివిధ రాష్ట్రాలలో పరిస్థితిని బేరీజు వేశారు. ఇందులో అసోంలో అత్యధిక సంఖ్యలో బాలలు మృతి చెందారు. గోవాతో పోలిస్తే ఇక్కడ ఏడు శాతం ఎక్కువ బాలల మరణాలు చోటుచేసుకున్నాయి. ఐదేళ్లలోపు పిల్లలలో మరణాలకు పలు కారణాలు ఉన్నట్లు వెల్లడైంది. నవజాత శిశువుల దశలలో తలెత్తే సంక్లిష్టతలు, నయం చేయడానికి వీలున్న సంక్రమిత వ్యాధులు సోకడం, వాటి నుంచి సరైన రీతిలో పిల్లలను కాపాడుకోలేకపోవడం వంటి పలు అంశాలు ఉన్నాయి. కొన్నిరాష్ట్రాలలో శిశు మరణాలు అత్యధికంగా ఉన్నాయని, వివిధ రకాల టీకాలు, ప్రసవ అనంతర జాగ్రత్తలపై సరైన అవగావహనల విషయంలో సమగ్ర రీతిలో చర్యలు లేకపోవడం కీలకమైన విషయాలని తెలిపారు. శిశు, బాల్య దశ వారి విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను మరింత ఎక్కువగా చేపట్టాల్సి ఉందని బ్లూమ్‌బెర్గ్‌స్కూల్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ లీ లియూ తెలిపారు.

భారతీయ ప్రభుత్వ ఆరోగ్య సర్వేలను ప్రాతిపదికగా తీసుకునే, వాటిలోని గణాంకాల మేరకే 25 రాష్ట్రాలలోని శిశు మరణాలు, అందుకు దారితీసిన కారణాలను ఆరాతీశారు. ఐరాస తలపెట్టిన సహాస్రాబ్ధి లక్ష్యాలు ఎండిజిలో భాగంగా 2015 నాటికే శిశు మరణాలను గణనీయంగా తగ్గించాలని సంకల్పించారు. 1990 అంకెలతో పోలిస్తే వీటిని మూడింట ఒక వంతు తగ్గించాలని తలపెట్టారు. ఇండియాకు సంబంధించినంత వరకూ పుట్టిన ప్రతి వేయి మంది శిశువులలో మరణాలను 39తో కట్టడి చేయాలని లక్షం విధించారు. అయితే ఓ వైపు భారీ స్థాయిలోనే శిశు మరణాల నివారణకు చర్యలు తీసుకుంటూ వస్తున్నా, భారతదేశం ఈ మేరకు శిశు మరణాలను తగ్గించలేకపోయింది. ప్రతి వేయి మంది శిశువులలో ఈ మరణాల రేటు మూడేళ్ల క్రితం వరకూ కూడా దాదాపు 91గా ఉందని వెల్లడైందని అధ్యయనకర్తలు తెలిపారు. ఇక పుట్టిన నాలుగు వారాలల్లోనే ఎక్కువగా పసి మొగ్గలు రాలిపోతున్నాయి. ఇది 57 శాతంగా ఉందని వెల్లడైంది. న్యూమోనియా, అంటువ్యాధులు వంటివి ఎక్కువగా పేదల పిల్లలకు ప్రాణాంతకాలు అవుతున్నాయి. వారి ఉసురు తీస్తున్నాయి.

Infant Deaths In India Lowest In 5 Years

Related Images:

[See image gallery at manatelangana.news]

The post శిశు విషాద దేశం మనది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: