గుట్కా తింటూ డ్రైవింగ్…

  ఆర్‌టిసి బస్సు బోల్తా, 10 మందికి తీవ్రగాయాలు జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల సరిహద్దులో ప్రమాదం మల్హర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా,పెద్దపల్లి జిల్లా సరిహద్దులో మల్హర్ మండలం పివినగర్ సమీపంలో బుధవారం గోదావరిఖని డిపోకు చెందిన (ఎపి01వై 2992) నెంబరు గల ఆర్‌టిసి అద్దె బస్సు బోల్తాపడింది. 10మందికి తీవ్రగాయలయ్యాయి. గోదావరిఖని నుండి భూపాలపల్లికి వెళ్తున్న ఈ బస్సులో 63మంది ప్రయాణికులు ఉన్నారు. ఉద యం 10.30 గంటలకు గోదావరిఖని నుండి బయలుదేరిన బస్సు 11.30 […] The post గుట్కా తింటూ డ్రైవింగ్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆర్‌టిసి బస్సు బోల్తా,
10 మందికి తీవ్రగాయాలు
జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల సరిహద్దులో ప్రమాదం

మల్హర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా,పెద్దపల్లి జిల్లా సరిహద్దులో మల్హర్ మండలం పివినగర్ సమీపంలో బుధవారం గోదావరిఖని డిపోకు చెందిన (ఎపి01వై 2992) నెంబరు గల ఆర్‌టిసి అద్దె బస్సు బోల్తాపడింది. 10మందికి తీవ్రగాయలయ్యాయి. గోదావరిఖని నుండి భూపాలపల్లికి వెళ్తున్న ఈ బస్సులో 63మంది ప్రయాణికులు ఉన్నారు. ఉద యం 10.30 గంటలకు గోదావరిఖని నుండి బయలుదేరిన బస్సు 11.30 గంటలకు పివి నగర్ గ్రామ సమీపాన బస్సు బోల్తా పడింది. బస్సు డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి బస్సును నడుపుతున్నాడు. డ్రైవర్ నిర్లక్షం కారణంగానే బస్సు అదుపు తప్పి 8 మీటర్ల లోయలో పడిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అందులో గాయపడిన వారిని మంథని, కాటారం ,మహదేవ్‌పూర్ తదితర ఆసుపత్రులకు 108, పైవేటు వాహనాల ద్వారా తీసుకెల్లారు.10 మందికి తీవ్రగాయాలు కాగా30 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి,ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరుగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారంతా పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లా ప్రాంత వాసులు ఎక్కువగా ఉన్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని,ఎస్పీ భాస్కరన్ ,సిఐ శివప్రసాద్,ఎస్సైనరేష్ పరిశీలించారు.ఈ ప్రమాదం పై పోలీసులు కేసు నమోదు చేసుకొని పూర్థి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదానికి గుట్కాకారణమా?

ఇది ఇలా ఉండగా డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి రన్నింగులోనే గుట్కాను తింటూ ఈప్రమాదానికి కారనమైందని బస్సులోని కొందరు ప్రయాణీకులు తెలిపారు. సాధారణంగా మూల మలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాల్సిన డ్రైవర్ నిర్లక్షం చేయడం వల్లనే ప్రయాణీకులను మృత్యువు అంచులవరకు తీసుకెళ్లింది. ఆ క్రమంలోనే అదుపు తప్పిన బస్సు పల్టీలు కొట్టడంతో అదృష్టవశాత్తు అందులోని ప్రయాణీకులకు ముప్పు తప్పి ప్రాణపాయం నుండి బయట పడ్డారు.

Rtc Bus Rolled over.

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గుట్కా తింటూ డ్రైవింగ్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: