27న పరిషత్ ఓట్ల లెక్కింపు, ఫలితాలు…

మూడు విడతల్లో 77.46% పోలింగ్ జూలై 4తర్వాత కొత్త ఎంపిటిసిలు, 5 తర్వాత జెడ్‌పి చైర్మన్ల ఎన్నిక -రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి హైదరాబాద్: రాష్ట్రంలో మూడు విడుతల్లో నిర్వహించిన జెడ్‌పిటిసి, ఎంపిటిసిల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి. నాగిరెడ్డి తెలిపారు. మొత్తంగా 1.20 కోట్ల మంది ఓటు వేయడంతో 77.46 శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికలతో చూస్తే పరిషత్ ఎన్నికలకు ఓటింగ్ కాస్త […] The post 27న పరిషత్ ఓట్ల లెక్కింపు, ఫలితాలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మూడు విడతల్లో 77.46% పోలింగ్
జూలై 4తర్వాత కొత్త ఎంపిటిసిలు,
5 తర్వాత జెడ్‌పి చైర్మన్ల ఎన్నిక
-రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో మూడు విడుతల్లో నిర్వహించిన జెడ్‌పిటిసి, ఎంపిటిసిల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి. నాగిరెడ్డి తెలిపారు. మొత్తంగా 1.20 కోట్ల మంది ఓటు వేయడంతో 77.46 శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికలతో చూస్తే పరిషత్ ఎన్నికలకు ఓటింగ్ కాస్త తగ్గిందన్నారు. స్థానిక ఎన్నికల కోసం 65 వేల బ్యాలెట్ బాక్సులు (రిజర్వ్ కలిపి) వినియోగించామని, వాటన్నింటిని 536 స్ట్రాంగ్ రూమ్‌లకు భద్రంగా తరలించినట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత బలగాలు మోహరింపజేశామన్నారు.ఈ నెల 27న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. ఇప్పుడు ఉన్న ఎంపిటిసి, జెడ్‌పిటిసిలకు జులై 3 వరకు పదవీ కాలం ఉందని, కొత్తగా ఎన్నికైన జెడ్‌పిటిసిలు జూలై 4వ తేదీ నుంచి అధికారంలోకి వస్తారన్నారు. జులై 5 తరువాత జెడ్‌పి చైర్మన్ ఎన్నిక ఉంటుందని తెలిపారు. ఆగస్టు 5వ తేదీన ఖమ్మం జెడ్‌పి చైర్మన్ పదవి కాలపరిమితి ముగుస్తుందన్నారు. హైదరాబాద్‌లోని మసబ్‌ట్యాంక్‌లో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో కమిషనర్ వి. నాగిరెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఆదేశిస్తే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 123 కౌంటింగ్ కేంద్రాలు, 978 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ సూపర్ వైజర్స్ 11,882, కౌంటింగ్ అసిస్టెంట్స్ 23,647 మందిని నియమించినట్లు చెప్పారు. ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా చూసుకున్నామని, సాంకేతిక ఇబ్బంది వల్ల మూడు ఎంపిటిసిలకు రిపోల్ వచ్చిందన్నారు. సర్పంచ్ ఎన్నికలలో జరిగిన తప్పులను చూసుకొని పరిషత్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బంది, పోలీస్ శాఖ, అభ్యర్థులు, ఓటర్లకు అందరికి అభినందనలు చెప్పారు. ఒకటి, రెండు చోట్ల బ్యాలెట్ పేపర్‌లు బయటకు వచ్చిన నేపథ్యంలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. బ్యాలెట్ పేపర్‌ల ముద్రణకు సమయం తక్కువ ఉన్నందున కొంత తప్పిదాలు జరిగాయన్నారు. ఏడు చోట్ల బ్యాలెట్ పేపర్‌లలో తప్పిదాలు గుర్తించినట్లు తెలిపారు.

మూడు దశల్లో కౌంటింగ్
మూడు దశలలో కౌంటింగ్ జరుగుతుందని, మొదటి దశలో బ్యాలెట్ పేపర్‌లను పోలింగ్ కేంద్రాల వారీగా లెక్కిస్తారని కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ఆ తరువాత వీటిని బండిల్ చేస్తారు, అనంతరం ఎంపిటిసి, జెడ్‌పిటిసి వారిగా లెక్కిస్తారని వివరించారు. రెండో దశలో ఎంపిటిసి ఎన్నికకు కౌంటింగ్ మొదలు పెడతారన్నారు. ఒక్కో ఎంపిటిసికి ఇద్దరు ఏజెంట్‌లను ఏర్పాటు చేసుకోమని చెప్పామన్నారు.
ప్రతి బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేసి సరైనదా కాదా అనేది ఏజెంట్‌ల ముందు చూస్తారన్నారు. ఆ తరువాత రిటర్నింగ్ అధికారుల దగ్గరకు పంపిస్తారన్నారు. ఎక్కడ కూడా బలవంతపు ఏకగ్రీవాలు జరుగలేదన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో రూ.10 లక్షలు పంచుతూ దొరకడం చిన్న విషయం కాదని, ఒక్క ఎంపిటిసికి ఇంత డబ్బుతో దొరకడం మంచిది కాదని, అందుకే ఎన్నిక వాయిదా వేశామన్నారు. డబ్బులు పంచుతూ దొరికిన వ్యక్తిపై క్రిమినల్ కేసులు బుక్ చేసి నేరం రుజువైతే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆదేశాలు జారీ చేస్తామన్నారు.

158 ఎంపిటిసిలు, 4 జెడ్‌పిటిసిలు ఏకగ్రీవం
రాష్ట్రంలో మొత్తం 32 జెడ్‌పిలు, 539 జెడ్‌పిటిసిలు, 5857 ఎంపిటిసిలు ఉన్నాయి. ఇందులో 40 ఎంపిటిసిలు, ఒక జెడ్‌పిటిసి స్థానాలను హైకోర్టు ఉత్తర్వులతో ఎన్నికల నోటిఫికేషన్‌లో పేర్కొనలదేని నాగిరెడ్డి తెలిపారు. మొత్తం 5817 ఎంపిటిసి స్థానాలకు, 538 జెడ్‌పిటిసిలకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. ఇందులో 4 జెడ్‌పిటిసిలు, 158 ఎంపిటిసిలు ఏకగ్రీవమయ్యాయి. జెడ్‌పిటిసిల్లో కొమురం భీం ఆసిఫాబాద్‌లో ఒకటి, జగిత్యాల్‌లో రెండు, నల్లగొండలో ఒకటి ఉన్నాయి. అన్ని టిఆర్‌ఎస్ పార్టీనే గెలుచుకుంది. ఎంపిటిసిల్లో 152 టిఆర్‌ఎస్, మూడు కాంగ్రెస్, మరో మూడు స్వతంత్రులు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 534 జెడ్‌పిటిసిలు, 5659 ఎంపిటిసిలకు ఎన్నికలు నిర్వహించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ నెల 17న వనపర్తి జిల్లాలోని కదిరేపాడు ఎంపిటిసి స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు.

రూ.2.13 కోట్లు సీజ్

స్థానిక ఎన్నికల సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో రూ.1,09,51,230 నగదును సీజ్ చేసినట్లు నాగారెడ్డి తెలిపారు. అలాగే 1,04,40,743 కోట్ల విలువ చేసే ఇతర వస్తువులు సీజ్ చేసిన్టుల చెప్పారు. మొత్తంగా రూ.2.13 కోట్లు సీజ్ చేశారు. ఇందులో పార్టీలకు సంబంధించినవి పది ఉన్నట్లు గుర్తించారు.

Counting of votes for Parishad on 27th

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 27న పరిషత్ ఓట్ల లెక్కింపు, ఫలితాలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: