నో క్లీన్ చిట్…

  సినీడ్రగ్స్ కేసులో ఎవరినీ నిర్దోషులుగా ప్రకటించలేదు : అధికారులు హైదరాబాద్: టాలీవుడ్‌ను కుదిపేసిన మాదక ద్రవ్యాల కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఎక్సైజ్ శాఖ అధికారులు స్ప ష్టం చేశారు. ఈ కేసులో సినీ తారలు సహా ఏ ఒక్కరికీ క్లీన్‌చిట్ ఇవ్వలేదన్నారు. అంతేకాదు రెండేళ్ల క్రితం టాలీవుడ్ ప్రముఖులపై నమోదు చేసిన డ్రగ్స్ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు తె లిపారు. డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు 7 […] The post నో క్లీన్ చిట్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సినీడ్రగ్స్ కేసులో ఎవరినీ నిర్దోషులుగా ప్రకటించలేదు : అధికారులు

హైదరాబాద్: టాలీవుడ్‌ను కుదిపేసిన మాదక ద్రవ్యాల కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఎక్సైజ్ శాఖ అధికారులు స్ప ష్టం చేశారు. ఈ కేసులో సినీ తారలు సహా ఏ ఒక్కరికీ క్లీన్‌చిట్ ఇవ్వలేదన్నారు. అంతేకాదు రెండేళ్ల క్రితం టాలీవుడ్ ప్రముఖులపై నమోదు చేసిన డ్రగ్స్ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు తె లిపారు. డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు 7 ఛార్జిషీట్లు దాఖలయ్యాయని, ఇంకా 5 ఛార్జిషీట్లు త్వరలో దాఖలు చేస్తామని చెప్పారు. ఈ కేసులో సినీ ప్రముఖులకు సంబంధించిన ఫోరెన్సిక్ ఆధారాలు వచ్చాయని అన్నారు. డ్రగ్స్ కేసులో 62 మందిని విచారించినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని, ఛార్జి షీట్‌లో సైతం బలమైన అంశాలను పొందుపరచలేదంటూ వచ్చిన వార్తాల్లో వాస్తవం లేదని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇంకా పలు ఆధారాలు రావాల్సి ఉందని స్పష్టం చేశారు. తమకు లభ్యమైన ఆధారాలను బట్టి ఎప్పటికప్పుడు అభియోగ పత్రాలు దాఖలు చేసి కోర్టుకు సమర్పిస్తున్నామనే, తప్ప ఎవరికీ క్లీన్‌చిట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోమని.. పూర్తి ఆధారాలతో ముందుకెళ్తున్నామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యవస్థాపకులు పద్మనాభరెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా ఆబ్కారీ శాఖ నుంచి మాదక ద్రవ్యాల కేసు పురోగతిని తెలుసుకున్నారు. ఇందులో అధికారులు దాఖలు చేసిన నాలుగు ఛార్జిషీట్లలో ఒకటి దక్షిణాఫ్రికా పౌరుడు రఫెల్ అలెక్స్ విక్టర్‌పై ఉంది.

డ్రగ్స్ కేసుపై వార్తలు పాతవే: అకున్ సబర్వాల్

సమాచార హక్కు చట్టం ద్వారా డ్రగ్స్ కేసు వివరాలు స్వచ్ఛంద సంస్థ అడిగిన విషయం నిజమే అయినప్పటికీ అది గతేడాది జూన్ 13న సమర్పించిందని వెల్లడించారు. మాదక ద్రవ్యాల కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు.

Investigation into drug trafficking is still ongoing

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నో క్లీన్ చిట్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: