ఈశ్వరా…తప్పెవరిది…?

  కోల్‌కతాలో హింస, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసంపై బిజెపి, టిఎంసి మాటల యుద్ధం బాధ్యులు మీరంటే మీరని పరస్పరం ఆరోపణలు n నిరసనలు, ఇసికి ఫిర్యాదులు కోల్‌కతాలో పోటీగా ర్యాలీ నిర్వహించిన మమత న్యూఢిల్లీ, కోల్‌కతా : బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారంనాడు నిర్వహించన రోడ్ షో సందర్భంగా చెలరేగిన హింసపై బిజెపి, తృణమూల్ కాంగ్రెస్ పరస్పరం మాటల యద్ధానికి దిగాయి. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని అమిత్ షా బుధవారంనాడు […] The post ఈశ్వరా… తప్పెవరిది…? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కోల్‌కతాలో హింస, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసంపై బిజెపి, టిఎంసి మాటల యుద్ధం

బాధ్యులు మీరంటే మీరని పరస్పరం ఆరోపణలు n నిరసనలు, ఇసికి ఫిర్యాదులు
కోల్‌కతాలో పోటీగా ర్యాలీ నిర్వహించిన మమత

న్యూఢిల్లీ, కోల్‌కతా : బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారంనాడు నిర్వహించన రోడ్ షో సందర్భంగా చెలరేగిన హింసపై బిజెపి, తృణమూల్ కాంగ్రెస్ పరస్పరం మాటల యద్ధానికి దిగాయి. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని అమిత్ షా బుధవారంనాడు ఆరోపించారు. బెంగాల్‌లో జరిగిన హింసాత్మక ఘటనలకు మమతాబెనర్జీదే పూర్తి బాధ్యత అన్నారు. రాష్ట్రంలో తృణమూల్ కార్యకర్తలు అక్రమంగా పోలింగ్ బూత్‌ల్లోకి చొరబడి దుశ్చర్యలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. కోల్‌కతాలో తృణమూల్ కార్యకర్తలు తమపై దాడులకు దిగారనడానికి సాక్షంగా కొన్ని చిత్రాలను మీడియాకు అమిత్ షా చూపించారు. తృణమూల్ కాంగ్రెస్ కేవలం పశ్చిమబెంగాల్‌లోని 42 సీట్లలోనే పోటీ చేస్తుందని, కానీ మేం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నామన్నారు. గత ఆరు దశల ఎన్నికల్లో బెంగాల్‌లో జరిగినట్లుగా ఏ రాష్ట్రంలోనూ హింసాత్మక ఘటనలు జరగలేదని, దీనికి తృణమూల్ కాంగ్రెసే బాధ్యత వహించాలి అని అమిత్ షా అన్నారు.

దీనికి తృణమూల్ కూడా దీటుగా స్పందించింది. బెంగాల్ బయటి నుంచి వచ్చిన బిజెపి గుండాలు తీవ్ర నిరాశకు లోనై కాలేజీ లోపల ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. ‘ బెంగాల్ గురించి మీకేం తెలుసు. దానికి ఎంతో చరిత్ర ఉంది. మంగళవారం జరిగిన దాన్ని బెంగాల్ ఎప్పటికీ క్షమించదు’ అని టిఎంసి ప్రతినిధి డెరెక్ ఓబ్రియన్ ట్వీట్ చేశారు. బిజెపి కార్యకర్తలే విధ్వంసం సృష్టించారనడానికి తమ దగ్గర వీడియో సాక్షాలున్నాయని వాటిని మీడియాకు విడుదల చేశారు. మరోవైపు బిజెపి హింసాకాండకు పాల్పడిందని ఆరోపిస్తూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం కోల్‌కతాలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా బయటి నుంచి తీసుకొచ్చిన కిరాయి గూండాలే హింసాకాండకు కారణమని ఆరోపించారు. ఇలా ఉండగా కిరాయి గుండాలను తెచ్చి హింసకు పాల్పడ్డారని ఎన్నికల సంఘానికి తృణమూల్ నేతలు ఫిర్యాదు చేశారు.బిజెపి నేతల ప్రచారాన్ని రాష్ట్రంలో అడ్డుకోవాలని కోరారు. బిజెపి కార్యకర్తలు, పలువురు నేతలు అమిత్ షా ర్యాలీపై దాడిని నిరసిస్తూ ఢిల్లీలో మౌన ప్రదర్శన నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల కమిషన్ ప్రచారాన్ని ఒకరోజుకు కుదించడంపైనా మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ బెదిరింపపుల వల్లే ఎన్నికల కమిషన్ తీవ్రమైన నిర్ణయాన్నిసుకుందని ఆరోపింరు. ఇసి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మమత డిమాండ్ చేశారు. అయితే ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని సమర్ధించుకుంది. రాష్ట్రంలో ఉద్రిక్తత, భయానక పరిస్థితుల వల్లే తాము ఈ నిర్ణయానికి రావాల్సి వచ్చిందని పేర్కొంది.

మోడీఅమిత్ షా కారణం : కాంగ్రెస్
కోల్‌కతా లో బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా రోడ్ షో సందర్భంగా జరిగిన హింసాకాండను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఖండించారు. ప్రధాని నరేంద్రమోడీ, షా దేశంలో గుంపు స్వామ్యాన్ని పెంచి పోషిస్తున్నారని, ఇది రాష్ట్రాల సాంస్కృతిక ఉనికిని నాశనం చేస్తుందని ఆయన ఆరోపించారు. హింసాకాండ సందర్భంగా సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ విమర్శించారు. ‘గుంపు స్వామ్యానికి సంబంధించి కొత్త రాజకీయ వైఖరులు తలెత్తుతున్నాయి. అధికార పార్టీ బిజెపి మద్దతుతో ఐదేళ్లుగా అవి బలపడ్డాయి. ప్రతి రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారం మన సాంస్కృతిక వ్యవస్థ నాశనమవుతుందడానికి మోడీ, అమిత్‌షానే కారణం’ అని ఆయన విలేకరులతో అన్నారు. ఫెడరల్ వ్యవస్థ, ప్రాంతీయపరమైన ఆశలు, సంస్కృతి, భాష, ఆహారపు అలవాట్లు, దేశీయ ప్రజల గుర్తింపు వంటి అంశాలపై బిజెపి ప్రతి రాష్ట్రంలో దాడి చేస్తోంది’ అని ఆయన ఆరోపించారు.

Violence in Kolkata during the election campaign

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఈశ్వరా… తప్పెవరిది…? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: